Breaking News

ఐదో తరగతి బాలికలపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు..


విద్యాబుద్ధులు నేర్పాల్సిన చెప్పాల్సిన గురువు బాలికల పాలిట కీచకుడుగా మారాడు. జిల్లా ఏలూరులోని ఓ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు ఇద్దరు విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలికలు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పడంతో సోమవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. Also Read: ఏలూరుకు చెందిన కూరపాటి కిశోర్‌ స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఐదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. సోమవారం కూడా ఉపాధ్యాయుడు అదే తరహాలో ప్రవర్తించాడు. దీంతో మధ్యాహ్న సమయంలో ఇంటికెళ్లిన బాలికలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారంతా పాఠశాల వద్దకు వచ్చి కిశోర్‌ను నిలదీశారు. అనంతరం స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై రెండు పోక్సో కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. Also Read:


By December 24, 2019 at 10:08AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/west-godavari-teacher-molestation-on-two-girl-students/articleshow/72948994.cms

No comments