Breaking News

ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్‌వైజర్ భారీ చోరీ..


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఓ మద్యం దుకాణంలో భారీ చోరీ జరిగింది. జిల్లా పెనుకొండలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో అక్కడ పని చేసే సూపర్‌వైజరే చేతివాటం ప్రదర్శించాడు. మద్యం షాపులో ఏకంగా రూ. 9.12 లక్షలు చోరీ చేసి పరారయ్యాడు. అనంతపురం జిల్లా పెనుకొండలో ప్రభుత్వ నడుస్తోంది. అందులో శ్రీనాథ్ అనే వ్యక్తి సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. అయితే సోమవారం వేకువజామున దుకాణంలో మద్యం అమ్మకాలు చేయగా వచ్చిన రూ. 9.12 లక్షల నగదును చోరీ చేసి ఉడాయించాడు. Also Read: దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు చెప్పారు. మద్యపాన నిషేధానికి మొదటి అడుగుగా భావిస్తూ మద్యం దుకాణాల నిర్వహణను ఆంధ్రప్రదేశ్ సర్కారే తీసుకున్న విషయం తెలిసిందే. దుకాణాల నిర్వహణకు డిగ్రీ చదివిన నిరుద్యోగ యువతకు ప్రభుత్వమే ఇంటర్వ్యూలు నిర్వహించి సూపర్‌వైజర్లుగా నియమించింది. అలాగే సేల్స్‌మ్యాన్స్, సెక్యూరిటీని కూడా కాంట్రాక్టు పద్ధతిలో నియమించిన విషయం తెలిసిందే. Also Read:


By December 23, 2019 at 10:58AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/supervisor-robbery-in-government-liquor-shop-in-anantapur/articleshow/72933660.cms

No comments