మండపంలో షాకిచ్చిన వధువు.. పెళ్లి కొడుకుని బంధించి మరో యువకుడితో పెళ్లి

పెళ్లి కొడుకును బంధించి.. మరో వ్యక్తిని వధువు పెళ్లాడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సినీఫక్కీలో మలుపు తిరుగుతూ వచ్చిన ఈ ఘటనలో ఎన్నో ట్విస్టులు. ఉత్తరప్రదేశ్ బిజ్నూర్‌లోని నంగల్జాత్ గ్రామంలో ఘటన పూర్తి వివరాలిలా ఉన్నాయి. Also Read: నంగల్జాత్ గ్రామంలో ఆరేళ్ల క్రితం జరిగిన సామూహిక వివాహాల్లో యువతీ యువకుడు పెళ్లి చేసుకున్నారు. అయితే తమ పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలని కలగన్న ఆ వధూవరులకు ఆ పెళ్లి నచ్చలేదు. దీంతో ఆ అమ్మాయి కాపురానికి వెళ్లకుండా పుట్టింట్లోనే ఉంటోంది. ఆరేళ్ల తర్వాత వారిద్దరూ ఘనంగా మరోసారి పెళ్లి చేసుకోవాలని ఏర్పాట్లు చేసుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకుని అందరూ పెళ్లి మండపానికి వచ్చిన తర్వాత కట్నం విషయంలో వివాదం తలెత్తింది. Also Read: దీంతో ఆగ్రహించిన వధువు తరపువారు. పెళ్లికొడుకు, అతడి బంధువులను మండపంలోనే బంధించారు. పెళ్లకూతురు కోసం తెచ్చిన బంగారు ఆభరణాలు, చీరలను లాగేసుకున్నారు. ఇంతలో మనసు మార్చుకున్న వధువు పెళ్లికొడుకును చేసుకోనని చెప్పింది. దీంతో తల్లిదండ్రులు, ఊరి పెద్దలు చర్చలు జరిపి ఆమె పక్కింట్లో ఉండే ఓ యువకుడితో వివాహం జరిపించారు. పెళ్లికొడుకు తరపువారు తమ స్థోమతకు మించి కట్నం డిమాండ్ చేశారని, ఆ కోపంతోనే వారిని బంధించినట్లు వధువు బంధువులు చెబుతున్నారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు చెబుతున్నారు. Also Read:
By December 08, 2019 at 11:49AM
No comments