కడప జిల్లాలో వ్యభిచారం.. తిరుపతి నుంచి మహిళలను తీసుకొచ్చి సెక్స్ దందా

జిల్లా రైల్వేకోడూరులో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార కేంద్రాన్ని పోలీసులు పట్టుకున్నారు. పంచాయతీ కార్యాలయం సమీపంలోని ఓ నివాసంలో వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో సబ్‌ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, వెంకటనరసింహం సిబ్బందితో కలసి రైడ్ చేపట్టారు. Also Read: ఈ సందర్భంగా వ్యభిచార కేంద్రం నిర్వాహకుడు నాగపోగు శేఖర్‌తో పాటు మహబూబ్ బాషా అనే విటుడిని అరెస్ట్ చేశారు. తిరుపతి, రేణిగుంట, వెదురుకుప్పం, వెంకటగిరి ప్రాంతాల నుంచి శేఖర్ కొందరు మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రైడింగ్‌లో పట్టుబడిన సెక్స్‌వర్కర్లకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. Also Read: వ్యభిచారం చేయడం నేరమని, ఎవరైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మహిళ ఆర్థిక అవసరాలను ఆసగారా చేసుకుంటున్న కొందరు కేటుగాళ్లు వాళ్లను మభ్యపెట్టి వ్యభిచార కూపంలోకి దించుతున్నారని పోలీసులు చెబుతున్నారు. Also Read:
By December 16, 2019 at 11:10AM
No comments