ఆఫీసుకి వెళ్తూ రైలు నుంచి జారిపడి యువతి దుర్మరణం

రాజధాని ముంబయిలో విషాదం చోటుచేసుకుంది. కదులుతున్న రైలులో నుంచి జారిపడి ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. నగరానికి చెందిన చార్మీ ప్రసాద్(22) అనే యువతి ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. రోజూ ఇంటి నుంచి ఆఫీసుకి లోకల్ రైలులో వెళ్లేది. సోమవారం కూడా ఆఫీసుకు బయలుదేరిన చార్మి డోంబివలి-కోపార్ స్టేషన్ల మధ్యలో రైలు నుంచి జారి కిందపడి పోయింది. Also Read: ఈ విషయాన్ని తోటి ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆమె కోసం గాలించారు. ఓ చోట ట్రాక్ పక్కన పడివున్న యువతిని పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు చెప్పడంతో చార్మి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆఫీసుకి వెళ్లిన తమ కూతురు ఆస్పత్రిలో విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు రోదించారు. Also Read: ఘట్కాపూర్‌లోని ఓ సంస్థలో పనిచేసే తమ కూతురు రోజూ లోకల్ రైలులో వెళ్తుందని, ఇలా జరుగుతుందని తాము ఊహించలేదని ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. చార్మి మృతదేహాన్ని రైల్వే ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ముంబై సబ్‌అర్బన్ నెట్‌వర్క్ మార్గంలో రోజుకు దాదాపు 8-10 మంది రైలు నుంచి జారిపడి చనిపోతున్నట్లు లెక్కలు చెబుతున్నారు. ప్రయాణం సమయంలో ప్రయాణికులు నిర్లక్ష్యంగా డోర్ దగ్గర నిలబడుతుండటంతోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. Also Read:
By December 17, 2019 at 12:57PM
No comments