‘నల్లగొండ’ మాజీ కౌన్సిలర్ ఇంట్లో భారీ దోపిడీ!

జిల్లా మిర్యాలగూడలో దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. ఏకంగా మాజీ ప్రజా ప్రతినిధి ఇంట్లోకి చొరబడి అందిన కాడికి దోచుకెళ్లారు. ఇంట్లోని వారిని బంధించి మరీ వారు దోపిడీ పాల్పడ్డారు. నల్లగొంగ జిల్లా మిర్యాలగూడకు చెందిన మాజీ కౌన్సిలర్ సందీప ఇంట్లో సోమవారం భారీ దోపిడీ జరిగింది. Also Read: సందీప భర్తను తాళ్లతో కట్టేసి, ఇంట్లో వారిని బెదిరించి 30 తులాల బంగారు నగలు, రూ. 4 లక్షల నగదు దోచుకెళ్లారు. ఏకంగా మాజీ ప్రజాప్రతినిధి ఇంట్లోని భారీ దోపిడీ జరగడం పట్టణంలో సంచలనం రేపింది. ప్రజా ప్రతినిధులకే రక్షణ లేకపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని పలువురు వాపోతున్నారు. సందీప ఇంటిని సందర్శించిన పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. Also Read:
By December 23, 2019 at 10:37AM
No comments