Breaking News

ఆస్తి కోసం తోడబుట్టిన తమ్ముడిని చంపిన అన్న, వదిన


ఆస్తి కోసం భార్యతో కలిసి తోడబుట్టిన తమ్ముడినే చంపేశాడో వ్యక్తి. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్, నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఈ దారుణం చోటు చేసుకుంది. వెంకటేష్ (అన్న) దంపతులు, రమేష్ (తమ్ముడు) నల్లకుంట పీఎస్ పరిధిలో నివాసముంటున్నారు. రమేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే వీరిద్దరి మధ్య కొన్ని సంవత్సరాలుగా ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. దీంతో విసుగు చెందిన వెంకటేష్.. ఎలాగైనా తమ్ముడిని చంపాలని నిర్ణయించుకున్నారు. రమే‌ష్‌ను చంపేందుకు భార్యతో కలిసి పథకం రచించాడు.

Also Read:

నిద్రిస్తుండగా తాడుతో గొంతు నులిమి..అదను కోసం ఎదురు చూస్తున్న వెంకటేష్ దంపతులు శనివారం ఉదయం రమేష్ పడుకుని నిద్రిస్తుండగా, ఆడుకునే తాడుతో అతని మెడకు గట్టిగా బిగించారు. దీంతో ఊపిరి ఆడక రమేష్ మృతి చెందాడు. రమేష్ చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం వెంకటేష్ దంపతులు నల్లకుంట పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి లొంగిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ వివరాలు సేకరించింది. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌‌మార్టం నిమిత్తం పోలీసులు గాంధీ మార్చురీకి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. Also Read:


By December 07, 2019 at 01:22PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-murder-brother-over-property-issue-in-hyderabad/articleshow/72413254.cms

No comments