సమయం లైవ్ న్యూస్: జగన్‌పై ఆయేషా తల్లి సంచలన వ్యాఖ్యలు.. అధికారులపై హైకోర్టు ఆగ్రహం

⍟ దిశ చట్టంపై ఆయేషా తల్లి వ్యాఖ్యలు: దాదాపు 12 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలన సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యాచారం కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుకు సంబంధించిన ఆధారాల రికార్డులు విజయవాడ కోర్టులో ధ్వంసమైనందున, తిరిగి వాటిని సేకరించడం సీబీఐకి సవాల్గా మారింది. దీంతో రీ పోస్ట్‌మార్టం నిర్వహించాలని సీబీఐ నిర్ణయించింది. దీనికి కోర్టు అనుమతి ఇవ్వడంతో శనివారం పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ⍟ ఎలక్ట్రిక్ బస్సులకు రీటెండర్లు: ఏపీఎస్‌ఆర్టీసీ లీజు ప్రాతిపదిక తీసుకోనున్న ఎలక్ట్రిక్ బస్సులకు మళ్లీ టెండర్లు పిలవనున్నారు. ఎలక్ట్రికల్ బస్సుల లీజుకు సంబంధించి జ్యుడీషియల్ కమిషన్ పలు అభ్యంతరాలను వ్యక్తం చేయడంతో మళ్లీ టెండర్ల నిర్వహించాలని నిర్ణయించారు. జ్యుడీషియల్ కమిషన్ సూచనల ఆధారంగా టెండర్ ప్రక్రియలో మార్పులు చేర్పులకు అధికారులు చేపట్టారు ⍟ శ్రీవారి సన్నిధిలో భక్తుడు ఆత్మహత్య: శ్రీవారి సన్నిధిలో ప్రాణాలు వదిలితే స్వర్గానికి వెళ్తామనే నమ్మకమో లేదంటే వ్యక్తిగత సమస్యలు కారణమో తెలీదు కానీ.. ఉద్దేశపూర్వకంగా టీటీడీ పాల వ్యాన్ వెనుక చక్రాలకు కిందపడి.. ఓ భక్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీవారికి అభిషేకం చేసే పాల వ్యాన్ కింద పడి భక్తుడు సూసైడ్ చేసుకోవడం అందర్నీ విస్మయానికి గురి చేసింది. ⍟ పవన్ సన్నిహితుడు జనసేనకు రాజీనామా: పవన్ సన్నిహితుడు, జనసేన పొలిట్ బ్యూరో సభ్యుడు రాజు రవితేజ్ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. ఇకపై పవన్‌తో కానీ, జనసేన పార్టీతో కానీ తనకు ఎలాంటి సంబంధం ఉండదన్నారు. పవన్ కోరిక మేరకు తనకు ఇష్టం లేకపోయినప్పటికీ పొలిట్ బ్యూరోలో చేరానన్నారు. ⍟ అధికారులపై హైకోర్టు ఆగ్రహం: అధికారులు, ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. కోర్టులు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో వారు చూపుతున్న నిర్లక్ష్యం సరికాదని ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులపై ఉన్నతాధికారులు ఉదాసీనంగా ఉండడంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
By December 14, 2019 at 09:15AM
No comments