సమయం లైవ్ న్యూస్: జేసీకి మరో షాక్.. న్యూ ఇయర్ వేడుకలకు టీడీపీ దూరం

⍟ జే సీ దివాకర్‌రెడ్డికి బ్యాడ్ టైమ్.. పాపం మూడు రోజులకే మళ్లీ షాక్: మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి వరుసపెట్టి షాక్‌లు.. జగన్ సర్కార్‌పై వ్యాఖ్యలు చేసిన వారానికే మళ్లీ ట్విస్ట్. దివాకర్ ట్రావెల్స్ బస్సుల్ని మళ్లీ సీజ్ చేసిన రవాణాశాఖ అధికారులు.. హైకోర్టు తీర్పు ఇచ్చిన మూడురోజులకే మళ్లీ అవే బస్సులు.. ⍟ జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే మద్దాలి గిరికి టీడీపీ షాక్: దూకుడు పెంచిన టీడీపీ అధినేత చంద్రబాబు.. మద్దాలి గిరి పార్టీ మారిన కొద్ది గంటల్లోనే కీలక నిర్ణయం. మద్దాలి జంప్ కొట్టడంతో నియోజకవర్గ బాధ్యతలు కీలక నేతకు అప్పగింత. కేడర్ చెదిరి పోకుండా నష్ట నివారణ చర్యలు.. ⍟ న్యూ ఇయర్ వేడుకలకు టీడీపీ దూరం.. చంద్రబాబు ట్వీట్: న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం. పార్టీ కేడర్‌కు పిలుపునిచ్చిన చంద్రబాబు. బొకేలు, కేక్‌లు తీసుకు రావొద్దన్న టీడీపీ అధినేత. ఆ డబ్బును అమరావతి రైతుల కోసం ఇవ్వాలని పిలుపు.. జనవరి 1న అమరావతిలో చంద్రబాబు పర్యటన.. ⍟ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో విషాదం: అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసిన రమేష్ సోదరుడు ప్రకాష్ నాయుడు. రాజకీయాల్లో సీఎం రమేష్‌కు తోడుగా యాక్టివ్‌గా ఉన్న ప్రకాష్. ఎనిమిది నెలల క్రితమే ఆత్మహత్య చేసుకున్న సీఎం రమేష్ మేనల్లుడు.. ఆ విషాదాన్ని మర్చిపోకముందే మళ్లీ సోదరుడి మరణం వెంటాడింది.. ⍟ ⍟
By December 31, 2019 at 09:20AM
No comments