Breaking News

నోట్లో గుడ్డలు కుక్కి.. స్కూల్ టీచర్‌పై నలుగురి గ్యాంగ్ రేప్


ఓ వైపు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై దేశం మొత్తం ఆందోళనలు చేస్తుంటే కామాంధులు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలోని రాంపూర్ నైకిన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ప్రైవేటు స్కూల్ టీచర్‌పై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గురువారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న మహిళను అడ్డగించిన నలుగురు యువకులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆమె కేకలు వేయకుండా నోట్లో గుడ్డలు కుక్కి పైశాచికంగా ప్రవర్తించారు. Also Read: ఓ ప్రైవేటు స్కూ్‌ల్‌లో పనిచేస్తున్న బాధితురాలు రోజూ సాయంత్రం 5.30 గంటల సమయంలో ఇంటికి ఒంటరిగా వెళ్తుండేది. ఈ విషయాన్ని పసిగట్టిన నలుగురు యువకులు గురువారం ఆమెను అడ్డగించి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ కామాంధుల బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు విషయం చెప్పింది. దీంతో వారు అదే రోజు రాత్రి 8 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read: ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు నిందితులను బచు లోనియా, విరు లోనియా, నరేంద్ర లోనియా, శివశంకర్ లోనియాగా గుర్తించి నలుగురిని అరెస్ట్ చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. Also Read:


By December 08, 2019 at 12:51PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/madhya-pradesh-lady-teacher-gang-raped-by-four-accused-arrested/articleshow/72423721.cms

No comments