Breaking News

చిరు బయోపిక్‌కు అతడే కరెక్ట్‌.. నా వల్ల కాదన్న మెగా హీరో


ప్రస్తుతం సౌత్‌ నార్త్‌ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలతో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. క్రీడాకారులు, రాజకీయ నాయకులతో పాటు సినీ తారల జీవిత కథలను కూడా వెండితెర మీద ఆవిష్కరించేందుకు పోటి పడుతున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే సావిత్రి జీవిత కథతో మహానటి, ఎన్టీఆర్ జీవితంపై ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు వచ్చాయి. అయితే చాలా కాలంగా మెగాస్టార్‌ చిరంజీవి బయోపిక్‌పై కూడా చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం ప్రతి రోజు పండగే ప్రమోషన్‌లో ఉన్న సాయి ధరమ్‌ తేజ్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. మెగాస్టార్ చిరంజీవి బయోపిక్‌ తెరకెక్కిస్తే అందులో చిరు పాత్రలో నటిస్తారా అంటూ సాయి ధరమ్‌ను మీడియా ప్రశ్నించింది. అయితే ప్రశ్నకు సాయి ధరమ్‌ తేజ్‌ ఆసక్తికరంగా స్పందించాడు. మెగాస్టార్‌ బయోపిక్‌కు తాను న్యాయం చేయలేనన్న సాయి, రామ్‌ చరణ్ అయితే తండ్రి పాత్రకు పర్ఫెక్ట్‌ అన్నాడు. Also Read: మెగా హీరోలందరిలో మెగాస్టార్‌ పోలికలు ఎక్కువగా ఉన్న వ్యక్తి సాయి ధరమే. ముఖ్యంగా మెగాస్టార్‌ పాటల రిమిక్స్‌లలో సాయిని చూస్తే మెగాస్టారే తెర మీద కనిపిస్తున్నాడా అన్నంతగా మెప్పిస్తాడు. అయితే సాయి మాత్రం చిరు పాత్రకు చిరు తనయుడే కరెక్ట్ అంటూ బాల్‌ రామ్‌చరణ్ కోర్ట్‌లోకి నెట్టేశాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిరోజు పండగే సినిమాతో ఈ నెల 20 ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సాయి ధరమ్‌ తేజ్‌. కామెడీ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాతో రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. తాత మనవడి సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమాతో తాత పాత్రో సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ నటించాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు భారీగా నిర్వహిస్తున్నారు చిత్రయూనిట్‌. Also Read:


By December 08, 2019 at 01:07PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sai-dharam-tej-says-i-cant-do-justice-to-chiranjeevis-character/articleshow/72423928.cms

No comments