Breaking News

ఏపీలో మరో మైనర్ బాలికపై అత్యాచారం.. ‘దిశ’ బిల్లు పాసైన గంటల్లోనే!


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ‘దిశ’ చట్టం బిల్లు పాసై గంటలు గడవకముందే మైనర్ బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. శుక్రవారం గుంటూరులో మైనర్ బాలికపై ఇంటర్మీడియట్ విద్యార్థి అత్యాచార ఘటన మరువక ముందే.. ప్రకాశం జిల్లాలో శనివారం ఉదయం 16 ఏళ్ల బాలికపై మరో మృగాడు పశుతత్వం ప్రదర్శించాడు. Also Read: ప్రకాశం జిల్లాలోని మండలం రాజుపాలెంలో ఓ కరుణాకర్‌రెడ్డి అనే దుర్మార్గుడు నిద్రిస్తున్న (16)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. రోజూ మాదిరిగానే శుక్రవారం రాత్రి కూడా బాలిక ఇంట్లో ఒంటరిగా నిద్రకు ఉపక్రమించింది. అయితే శనివారం వేకువజామున బాలికపై అదే గ్రామానికి చెందిన కరుణాకరరెడ్డి (25) నోటిని అదిమిపట్టి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. Also Read:


By December 14, 2019 at 12:58PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/prakasam-man-rapes-minor-girl-when-her-sleeping/articleshow/72591819.cms

No comments