Breaking News

ప్రాణం తీసిన అక్రమ సంబంధం.. మాజీ ప్రియుడిని కొట్టి చంపిన టీవీ నటి


వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాన్ని బలి తీసుకుంది. అక్రమ సంబంధం కొనసాగించాలని ఒత్తిడి చేసినందుకు దేవి అనే టీవీనటి మాజీ ప్రియుడిని హత్య చేసింది. దేవి అనే మహిళ అనేక సీరియల్స్‌లో నటించింది. ప్రస్తుతం భర్త శంకర్‌తో కలిసి చాలా కాలంగా వడపళనిలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో మధురైకి చెందిన రవి(38) అనే వ్యక్తి 10ఏళ్ల క్రితం సినిమాల్లో నటించాలనే ఆసక్తితో చెన్నైకి వచ్చాడు. సాలిగ్రామంలో నివసిస్తున్న రవికి దేవితో పరిచయమైంది. కొంతకాలానికి వారిద్దరి వివాహేతర సంబంధం ఏర్పడింది. Also Read: ఈ సంబంధం కారణంగా తన కాపురంలో కలహాలు రావడంతో దేవి ప్రియుడిని వదిలించుకోవాలనుకుంది. దీంతో అతడికి చెప్పాపెట్టకుండా కొలత్తూర్‌ సెమాత్తమన్‌ కోవిల్‌ వీధికి ఇల్లు మారిపోయింది. నటిగా అవకాశాలు తగ్గిపోవడంతో టైలరింగ్‌ చేస్తోంది. ప్రియురాలు ఎక్కడికి వెళ్లిపోయిందో తెలీక రవి చాలారోజుల పాటు గాలించి చివరికి ఆమె చెల్లెలు లక్ష్మి ఇంటి అడ్రస్ కనుక్కున్నాడు. ఆదివారం ఆమె ఇంటికి మద్యం తాగి వెళ్లి గొడవ పడ్డాడు. దీంతో లక్ష్మి తన అక్కకు ఫోన్ చేసి విషయం చెప్పింది. కాసేపటికే దేవి భర్తతో కలిసి అక్కడికి చేరుకుని రవిని హెచ్చరించింది. Also Read: తనతో అక్రమ సంబంధం కొనసాగించాలని రవి పట్టుబట్టడంతో దేవి కోపం పట్టలేక మాజీ ప్రియుడి తలపై ఇనుప రాడ్‌తో బలంగా కొట్టింది. ఆమె భర్త శంకర్ సైతం కర్రతో అతడిని చితకబాదాడు. తీవ్ర రక్తస్రావంతో రవి అక్కడికక్కడే చనిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న కొలట్టూర్‌ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రవి దేవి, శంకర్, లక్ష్మిని అరెస్ట్ చేశారు. విర మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కీల్‌పాక్కమ్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. Also Read:


By December 31, 2019 at 08:35AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tamilnadu-man-killed-by-ex-lover-due-to-sexual-harassment/articleshow/73039643.cms

No comments