Breaking News

బిర్యానీ బిల్లు కట్టలేని ఫ్రెండ్‌ని హత్యచేసిన యువకులు.. హైదరాబాద్‌లో ఘోరం


స్నేహితులంతా కలిసి మద్యం తాగారు. ఆ మత్తులోనే హోటల్‌కి వెళ్లి తిన్నారు. బిల్లు చెల్లించే విషయంలో వివాదం తలెత్తింది. బిల్లు నువ్వు కట్టు అంటే నువ్వు కట్టు అంటూ గొడవ పడ్డారు. ఈ క్రమంలో తీవ్రంగా గొడవ పడిన ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన హైదరాబాద్‌‌లోని ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హన్మకొండకు చెందిన అభిలాశ్‌ (28) రెండేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఏడాది నుంచి ముషీరాబాద్‌ డివిజన్‌ వైఎస్సార్‌ పార్కు వద్ద అద్దె ఇంట్లో ఉంటూ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. Also Read: ఈ క్రమంలోనే అదే కాలనీకి చెందిన వంశీ, చందు, హరీశ్‌లతో స్నేహం ఏర్పడింది. ఈ నెల 24 రాత్రి నలుగురు కలిసి మద్యం సేవించారు. అనంతరం నారాయణగూడలోని ఓ హోటల్‌కు వెళ్లి బిర్యానీ తిన్నారు. బిల్లు నువ్వు చెల్లించమంటే..నువ్వు చెల్లించమని వారి మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడ వివాదం సద్దుమణిగాక అంతా కలిసి వైఎస్సాఆర్‌ పార్కు వద్దకు చేరుకున్నారు. అక్కడ మరోసారి గొడవ పడ్డారు. ఈ క్రమంలో వంశీ.. అభిలాశ్‌ను తోసేయడంతో పక్కనే ఉన్న రాయిపై పడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో అతడిని వెంటనే యశోద ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. అభిలాశ్‌ తండ్రి రమేశ్‌ ఫిర్యాదుతో ముషీరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:


By December 31, 2019 at 08:58AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-murdered-by-3-friends-over-hotel-bill-argument-in-hyderbad/articleshow/73039863.cms

No comments