Breaking News

పక్కింటి బాలికను యాదాద్రి తీసుకెళ్లి లాడ్జిలో అత్యాచారం.. రెండో పెళ్లికి ఒత్తిడి


అతడో వివాహితుడు. భార్య గర్భవతి కావడంతో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. దీంతో తన కోరికలు తీర్చుకునేందుకు తన పక్క పోర్షన్‌లో అద్దెకు ఉండే 16ఏళ్ల బాలికపై అతడి కన్ను పడింది. మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా ఆమెపై లైంగిక దాడికి పాల్పడేవాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో బాలిక తల్లిదండ్రులు అతడిని నిలదీశారు. దీంతో ఆమె రెండో పెళ్లి చేసుకుంటానంటూ వారిపై ఒత్తిడి తెచ్చాడు. చివరకు ఈ వ్యవహారం పోలీసులకు చేరడంతో నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. Also Read: హైదరాబాద్‌లోని సైదాబాద్‌ డివిజన్‌ పూసలబస్తీలోని హరిజనబస్తీలో ఉంటున్న భార్గవ్‌ ఇంటి పక్కనే కొద్దిరోజుల క్రితం ఓ కుటుంబం అద్దెకు దిగింది. గర్భవతి అయిన భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్లడంతో భార్గవ్ ఒంటరిగా ఉండేవాడు. ఈ క్రమంలోనే పక్కింట్లో ఉండే కుటుంబంలోని 16ఏళ్ల బాలికపై కన్నేసి అమెను లొంగదీసుకున్నాడు. ఆమెను తరుచూ తనింటికి తీసుకెళ్లి లైంగికంగా అనుభవించేవాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి పద్ధతి మార్చుకోవాలని భార్గవ్‌ను మందలించడంతో మూడు నెలల క్రితం ఇంటిని ఖాళీ చేసి మరో చోటికి వెళ్లాడు. Also Read: అయినప్పటికీ బాలికను వదలని ఆ కామాంధుడు ఆమెకు మాయమాటలు చెప్పి అనేకసార్లు యాదాద్రికి తీసుకెళ్లి లాడ్జిలో అత్యాచారానికి పాల్పడేవాడు. ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలు తీసి వాటిని ఆమె తండ్రికి చూపించి బెదిరించాడు. బాలికను తనకిచ్చి రెండో పెళ్లి చేయకపోతే ఫోటోలను బయటపెడతానని వేధించసాగాడు. అతడి వేధింపులు ఎక్కువ కావడంతో బాలిక తండ్రి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదుచేసుకున్న ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తన కూతురి జీవితాన్ని నాశనం చేసిన భార్గవ్‌ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి తండ్రి పోలీసులను కోరాడు. Also Read:


By December 05, 2019 at 10:46AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-man-arrested-for-raped-on-minor-girl/articleshow/72378309.cms

No comments