Breaking News

భర్త మొహంపై యాసిడ్ పోసి, రోకలి బండతో మోది.. నెల్లూరులో కిరాతక హత్య


గ్రామీణ మండలం నరుకూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన ఇమ్మిడిశెట్టి శీనయ్య హత్యకేసును పోలీసులు చేధించారు. శీనయ్యను ఆయన భార్య, కుమారులే హత్య చేసినట్లు తేల్చిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే హత్య గురించి పోలీసులకు శీనయ్య భార్య, కుమారులే ఇవ్వడంతో ముందుగా వారిపై అనుమానం కలగలేదని నెల్లూరు డీఎస్పీ కేవీ రాఘవరెడ్డి తెలిపారు. Also Read: నరుకూరు ఇందిరమ్మ కాలనీకి శీనయ్య మద్యానికి బానిసై బంధువులైన మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు. దీంతో ఇంట్లో నిత్యం గొడవలు జరిగేవి. పద్ధతి మార్చుకోవాలని భార్య నాగమ్మ, కుమారుడు ఎంత చెప్పినా అతడు వినిపించుకోలేదు దీంతో నవంబర్ 28న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న శీనయ్య మొహంపై భార్య యాసిడ్ పోసేసింది. బాధతో విలవిల్లాడుతున్న అతడిని కుమారుడు రోకలిబండతో తల, కాళ్లు, చేతులపై కొట్టి చంపేశారు. Also Read: మృతదేహాన్ని దూరంగా పడేసి తర్వాత తన భర్తను ఎవరో హత్య చేశారని అతడి భార్య నాగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో భాగంగా మృతుడి భార్య, కుమారుడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. చివరికి శీనయ్యను తామే చంపామని నిందితులు అంగీకరించడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ హత్య కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన సీఐ వి.శ్రీనివాసరెడ్డి, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగార్జునరెడ్డి, పోలీస్‌ సిబ్బందిని నెల్లూరు రూరల్‌ డీఎస్పీ కేవీ రాఘవరెడ్డి అభినందించారు. Also Read:


By December 05, 2019 at 10:19AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-kills-husband-due-to-harasment-in-nellore/articleshow/72378054.cms

No comments