Breaking News

కోరిక తీర్చాలంటూ మహిళా కానిస్టేబుల్‌కు వేధింపులు... కీచక ఎస్ఐపై వేటు


లైంగిక కోరిక తీర్చాలంటూ మహిళా కానిస్టేబుల్‌ను వేధిస్తున్న కీచక ఎస్ఐపై ఉన్నతాధికారులు వేటు వేశారు. జిల్లా ఓ పోలీస్ సబ్ డివిజన్ కేంద్రంలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో ఓ మహిళ కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఆమెపై కన్నేసిని అదే స్టేషన్‌కు చెందిన ఓ ఎస్ఐ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. తన కోరిక తీర్చాలని, అక్రమ సంబంధం పెట్టుకోవాలని వేధిస్తున్నాడు. తరుచూ ఆమెకు వాట్సాప్‌లో అసభ్యకర మెసేజ్‌లు పంపిస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నాడు. తనతో న్యూడ్ చాట్ చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నాడు. Also Read: తాను అలాంటి దాన్ని కాదని, తనను వదిలేయాలని బాధితురాలు మొర పెట్టుకున్నా ఆ ఎస్ఐ పట్టించుకోవడం లేదు. దీంతో బాధితురాలు అదే సబ్‌ డివిజన్‌కు చెందిన సీఐతో తన బాధ పంచుకుని కాపాడాలని వేడుకుంది. దీంతో సీఐ ఆ కీచక ఎస్ఐని పిలిపించి చీవాట్లు పెట్టాడు. అయినా ఆ కామాంధుడిలో మార్పు రాకపోవడంతో బాధితురాలు ఈ వ్యవహారాన్ని జిల్లా ఎస్పీకి దృష్టికి తీసుకెళ్లింది. Also Read: దీనిపై విచారణ చేపట్టిన ఎస్పీ ఆ కీచక ఎస్‌ఐ వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారించారు. దీంతో అతడిని వెంటనే ఆ స్టేషన్‌ నుంచి బదిలీ చేసి వీఆర్‌లో ఉంచారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు శాఖలోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Also Read:


By December 26, 2019 at 08:41AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/sub-inspector-sexual-harassment-on-lady-conistable-in-jagityal/articleshow/72973620.cms

No comments