ఇద్దరు బిడ్డలకు నిప్పంటించి.. ఆపై తానూ తగలబడి..

ముక్కుపచ్చలారని ఇద్దరు బిడ్డలపై కిరోసిన్ పోసి నిప్పంటించి.. ఆపై తాను కాల్చుకుని సజీవ దహనమైంది ఓ మహిళ. కుటుంబ కలహాల నేపథ్యంలో మహిళ ఆ దారుణానికి ఒడిగట్టింది. తెలంగాణ రాష్ట్రంలోని పట్టణంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. Also Read: కొల్లాపూర్‌లోని టీచర్స్ కాలనీలో మహేష్, నిహారిక దంపతులు నివసిస్తున్నారు. వీరికి మణిదీప్తి (4 సంవత్సరాలు), కేదార్‌నాథ్ (16 నెలలు) సంతానం. మహేష్ పెంట్లవెల్లిలో మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. అయితే కొద్ది రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపం చెందిన నిహారిక ఇంట్లో అత్త మాత్రమే ఉన్న సమయంలో కూతురు, కొడుకును మేడ మీదికి తీసుకెళ్లి వారిపై కిరోసిన్ పోసి నిప్పంటించి.. ఆపై తాను కూడా అగ్గి రాజేసుకుంది. దీంతో ముగ్గురూ సజీవ దహనమయ్యారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఒకే ఇంట్లో ముగ్గురు మరణించడంతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. Also Read:
By December 07, 2019 at 03:02PM
No comments