కృష్ణానదిలో దూకిన యువతి... చివరికి ఏం జరిగిందంటే..

కృష్ణా జిల్లాలోని పులిగడ్డ - పెనుముడి వంతెనపై నుంచి ఈరోజు ఓ యువతి కృష్ణానదిలోకి దూకేసింది. ఆమెను దూరం నుంచి చూసిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని రక్షించారు. వంతెన సమీపంలో నో యాక్సిడెంట్ డే కార్యక్రమాన్కి నిర్వహిస్తున్న పోలీసులకు వాహనదారులు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే స్పందించారు. Also Read: అవనిగడ్డ ఏఎస్ఐ మాణిక్యాలరావు, కానిస్టేబుల్ గోపిరాజు నదిలోకి యువతిని క్షేమంగా ఒడ్డుకు చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఆమెను చికిత్సకోసం అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుందన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. Also Read: సకాలంలో స్పందించి యువతి ప్రాణాలను కాపాడిన ఏఎస్ఐ మాణిక్యాలరావును, కానిస్టేబుల్ గోపిరాజును పోలీసు ఉన్నతాధికారులు, స్థానికులు అభినందించారు. ఏఎస్ఐ మాణిక్యాలరావు ఈ నెలాఖరుకు రిటైర్మెంట్ కానున్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. Also Read:
By December 08, 2019 at 12:12PM
No comments