అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్న బిడ్డనే కడతేర్చిన తల్లి!

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని పేగుతెంచుకుని పుట్టిన బిడ్డనే గొంతు నులిమి చంపేసిందో కసాయి తల్లి. శివారు ప్రాంతమైన రాజేంద్రనగర్‌లో సోమవారం ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. రాజేంద్రనగర్‌లో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. వారికి ఏడేళ్ల కుమారుడు అంజాద్ సంతానం. అయితే ఆ మహిళ మరో వ్యక్తితో పెట్టుకుంది. ఈ నేపథ్యంలో అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో బిడ్డను చంపాలని నిర్ణయించుకుంది. Also Read: సోమవారం ఉదయం తన ఏడేళ్ల కుమారుడిని అత్యంత పాశవికంగా గొంతు నలిమి హత్య చేసింది. తర్వాత ఏమీ తెలియనట్లు నటించింది. ఈ విషయం స్థానికులకు తెలియడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న మైలార్ దేవిపల్లి పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కన్న బిడ్డను తల్లే చంపడంపై కాలనీ వాసులు ఉలిక్కిపడ్డారు. ఆ కసాయి తల్లిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. Also Read:
By December 23, 2019 at 12:43PM
No comments