సమయం లైవ్ న్యూస్.. అనంతపురంలో వోల్వో బస్సు బోల్తా.. ఒకరు మృతి

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నవంబరు 30కి ఆరు నెలలు పూర్తయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకట వెలువరించింది. వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే ఎన్నికల మేనిఫేస్టోలోని 82 శాతం హామీలను అమలుచేయడం లేదా ఆ దిశగా చర్యలు చేపట్టినట్టు తెలిపింది. వివిధ వర్గాల సంక్షేమం, అవినీతిరహిత పాలన, పౌరుల సమస్యల సత్వర పరిష్కారానికి అనేక చర్యలు చేపట్టిందని పేర్కొంది. అనంతపురం పట్టణ శివార్లలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. తపోవనం వద్ద వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. గాయపడినవారికి చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెటర్నరీ డాక్టర్ మిస్సింగ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై రవికుమార్, ఎయిర్‌పోర్టు పీఎస్‌కు చెందిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్‌లను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. నవంబరు 28 రాత్రి శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి మిస్సింగ్‌కు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో ఆలస్యం కావడంపై విచారణ జరిపిన పోలీసులు.. నివేదిక ఆధారంగా ముగ్గురు సిబ్బందిని విధుల నుంచి తప్పించారు. డిసెంబరు 1 నుంచి నుంచి విశాఖ- బెంగళూరు మధ్య ఇండిగో సంస్థ నూతన విమాన సర్వీసును ప్రారంభించింది. ఈ విమానం ప్రతిరోజూ బెంగళూరు నుంచి ఉదయం 5.30 గంటలకు బయలుదేరి ఉదయం 7.05 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. తర్వాత అదే విమానం ఉదయం 7.45 గంటలకు విశాఖలో బయలుదేరి ఉదయం 9.30 గంటలకు బెంగళూరు చేరుతుంది. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ సర్కారు శనివారం బల పరీక్షలో నెగ్గింది. ఓటింగ్‌కు ముందు బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. దీంతో 288 సీట్లున్న అసెంబ్లీలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి 169 ఓట్లు వచ్చాయి. తీర్మానం నెగ్గిన తర్వాత ఎమ్మెల్యేలు, మహారాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కృతజ్ఞతలు తెలిపారు. జార్ఖండ్ అసెంబ్లీకి శనివారం తొలిదశ పోలింగ్ జరిగింది. మొత్తం 13 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించగా, దాదాపు 64.2శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 81 శాసనసభా నియోజకవర్గాలు ఉన్న జార్ఖండ్‌లో ఐదు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అక్కడక్కడ చెదురు మదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. గుల్మా జిల్లాలో బిష్నుపుర్ నియోజకవర్గంలో ఒక కల్వర్ట్ వద్ద నక్సల్స్ మందుపాతర పేల్చారు.
By December 01, 2019 at 08:40AM
No comments