Breaking News

హైదరాబాద్‌లో మరో ఘోరం.. మహిళా టెక్కీపై ఫ్రెండ్ అత్యాచారం


వరుస అత్యాచారాలతో భాగ్యనగరం ఉలిక్కిపడుతోంది. మూడురోజుల క్రితం వెటర్నరీ డాక్టర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దహనం చేసిన ఘటన దేశవ్యాప్తంగా ఎంతటి కలకలం రేపిందో చూస్తూనే ఉన్నాం. అంతటి ఘోరానికి పాల్పడిన కామాంధులను వెంటనే ఉరి తీయాలని ఓ వైపు ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే.. మరోవైపు మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. నిజాంపేటలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై ఆమె స్నేహితుడొకరు అత్యాచారానికి పాల్పడ్డాడు. Also Read: ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్న యువతి సోదరితో కలిసి నిజాంపేటలోని ఈశ్వర్ విలాస్ రోడ్‌లోని ఓ అపార్ట్‌మెంట్లో అద్దెకు ఉంటోంది. ఆమెకు జాయల్ చంద్(27) అనే యువకుడు స్నేహితుడు. అప్పుడప్పుడూ ఆమె ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలోనే శనివారం జాయల్ ఆమె ఇంటికి రాగా.. యువతి ఒంటరిగా ఉంది. దాన్ని అవకాశంగా తీసుకున్న ఆ కామాంధుడు స్నేహితురాలు అనికూడా చూడకుండా బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. Also Read: బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో భయపడిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సాయంత్రం వేళ ఇంటికి వచ్చిన సోదరి గదిలోకి వెళ్లి చూసి షాకైంది. నగ్నంగా పడివున్న బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. బాధితురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. Also Read:


By December 01, 2019 at 08:24AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-techie-raped-by-friend-case-booked/articleshow/72314737.cms

No comments