Breaking News

సమయం లైవ్ న్యూస్: దొంగ రంగవైభోగం.. మాజీ ఎమ్మెల్యే చుట్టూ బిగుస్తున్న ఉచ్చు


⍟ వెంకయ్యను కలిసిన అమరావతి రైతులు: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గత వారం రోజుల నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని రాజధాని ప్రాంత రైతులు, అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ..నవ్యాంధ్ర రాజధాని రైతుల సమస్యలు నాకు తెలుసని, ఈ అంశంలో ఏంచేస్తే బాగుంటుందో, మంచి జరుగుతుందో అదే చేస్తానని అన్నారు. ⍟ మళ్లీ పప్పులో కాలేసిన లోకేశ్: మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మళ్లీ నెటిజన్లకు దొరికిపోయారు. జగన్ సర్కార్‌ను ఇరుకున పెట్టబోయి.. తానే తప్పులో కాలేశారు. ఇంకేముంది నెటిజన్లు ఊరుకుంటారా.. ట్రోలింగ్స్ మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో ఓ ఆటాడుకుంటున్నారు. మంత్రిగా ఎలా పనిచేశావయ్యా బాబూ అంటూ లోకేష్‌పై సెటైర్లు పేలుస్తున్నారు. ⍟ టీడీపీ నేత చుట్టూ ఉచ్చు: జగన్ సర్కార్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కేసును సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. యరపతినేనితో పాటూ మరో 15 మందిపై నమోదైన అక్రమ మైనింగ్‌ కేసుల విచారణను ఇక సీబీఐ చేతికి వెళ్లనుంది. యరపతినేనిపై ఉన్న 18 కేసులపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ.. హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ⍟ వైసీపీ Vs బీజేపీ: వైసీపీ ఎంపీ విజయసాయిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. సుజనా ఆర్థిక నేరాలపై ఈడీ, సీబీఐ దర్యాప్తు చేయించాలంటూ విజయసాయి రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడంపై ఆయన స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. దేశంలో ఏ పౌరుడైనా రాష్ట్రపతికి అర్జీ పెట్టుకుంటే సంబంధిత శాఖలకు పంపిస్తారని.. విజయసాయి ఫిర్యాదు కూడా అలాంటిదేనన్నారు. ⍟ మడమ తిప్పిన జగన్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాను అధికారంలోకి వస్తే అమరావతిలోనే రాజధాని ఉంటుందని.. అద్భుతమైన నగరం నిర్మిస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ⍟ దొంగ వైభోగం మామూలుగా లేదుగా: అతడి పేరు రాజు. అసలు పేరు ఎవరికీ తెలియదు. చందానగర్‌లో ధనిక వర్గాల వారు నివాసం ఉండే మై హోమ్స్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటాడు. అద్దె రూపంలోనూ అతడు నెలకు రూ.30 వేలు చెల్లిస్తున్నాడు. ఇక ఇద్దరు పిల్లలు ఇంటర్నేషన్ స్కూల్లో చదువుతున్నారు. వారికి సంవత్సరానికి 8 లక్షల రూపాయలు ఫీజు. భార్య ఒంటిపై బంగారం కిలో వరకు ఉంది.


By December 25, 2019 at 08:51AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/telugu-top-trending-andhra-telangana-national-news-headlines-on-25th-december-2019/articleshow/72962716.cms

No comments