Breaking News

ముత్తూట్‌ ఫైనాన్స్‌లో 70కిలోల బంగారం ఎత్తుకెెళ్లిన దొంగలు


కర్ణాటక రాజధాని బెంగళూరులోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ కేంద్ర కార్యాలయంలో దొంగలు విరుచుకుపడ్డారు. గోడకు కన్న పెట్టి రూ.16కోట్ల విలువైన 70కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. పులికేశినగర పోలీసుస్టేషన్‌ పరిధిలోని లింగరాజపురంలో ముత్తూట్ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. ఆ భవనంలోని మరుగుదొడ్డి వైపు నుంచి గోడకు గ్యాస్‌ కట్టర్లతో కన్నం పెట్టారు. Also Read: ఆ తర్వాత లోనికి ప్రవేశించి బీరువాలు, లాకర్లను ధ్వంసం చేసి బంగారు నగలతో పరారయ్యారు. ఆధారాలు లభించకుండా నిందితులు సైరన్‌, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. మంగళవారం ఆఫీసు తలుపులు తెరిచిన సిబ్బంది దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఈ నెల 21న రాత్రి చోరీ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సెలవుల కారణంగా ఆది, సోమవారాలు కార్యాలయం మూసే ఉంది. దీంతో ఈ ఘటన మూడ్రోజుల ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. Also Read:


By December 25, 2019 at 09:17AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/16-kgs-gold-robbery-in-bangalore-muthoot-finance-office-case-under-investigation/articleshow/72962947.cms

No comments