ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 32 మంది మృతి, 50 మందికి గాయాలు

దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం ఘోర సంభవించింది. ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండీలో జరిగిన ఈ ప్రమాదంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 50 మంది గాయపడినట్టు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ టీం సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. అగ్నిమాపక సిబ్బంది 50 మందిని సురక్షితంగా బయటకు తీశారు. మొత్తం 27 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేస్తున్నాయి. ఉదయం 5.30 ప్రాంతంలో ఒక్కసారిగా భవనంలో మంటలు చెలరేగి అంతటా వ్యాపించాయి. అందరూ గాఢనిద్రలో ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరగడంతో అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదంలో గాయపడినవారిని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ హాస్పిటల్‌కు తరలించారు. అయితే, అప్పటికే కొందరు చినపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. కొంత మందిని ఆర్ఎంఎల్ హాస్పిటల్, హిందూరావు హాస్పిటల్‌కు తరలించిన చికిత్స అందజేస్తున్నారు. ఘటనా స్థలంలోనే 30 మంది వరకు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. అనాజ్ మండిలోని దాదాపు 600 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఓ భవనంలో మంటలు చెలరేగినట్టు డిప్యూటీ ఫైర్ చీఫ్ ఆఫీసర్ సునీల్ చౌధురి వెల్లడించారు. ఇ ది స్కూల్ బ్యాగులు, బాటిల్స్, ఇతర వస్తువులు తయారుచేసే ఫ్యాక్టరీగా గుర్తించినట్టు తెలిపారు. ప్రమాదం జరిగే సమయానికి పరిశ్రమలో 15 నుంచి 20 మంది కార్మికులు నిద్రిస్తున్నారని వివరించారు. గాయపడినవారిలో 15 మందిని ఎల్ఎన్‌జేపీ హాస్పిటల్‌కు తరలించినట్టు తెలిపారు.
By December 08, 2019 at 09:37AM
No comments