30 తులాల బంగారం చోరీ కేసులో తెలుగు టీవీ నటుడి అరెస్ట్

టీవీ సీరియళ్లలో కనిపించే ఓ నటుడు తాజాగా దొంగోడి అవతారమెత్తాడు. అనేక సీరియల్స్, షార్ట్‌ఫిల్మ్‌లో కనిపించే అతడు దొంగతనాలు చేయడం ప్రవృత్తిగా మార్చుకున్నాడు. దొంగతనాల కేసుల్లో గతంలో అరెస్టయి జైలుకెళ్లినా బుద్ధి మారలేదు. తాజాగా మరోసారి దొంగతనానికి పాల్పడి పోలీసులకు చిక్కాడు. Also Read: ఉప్పల్ పరిధి నాగారంలోని వికాస్‌నగర్‌కు చెందిన బలిజ విక్కీ అలియాస్ విక్కీ భాయ్(28) అనేక టీవీ సీరియళ్లలో నటించాడు. అయితే సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో షూటింగులు లేని సమయంలో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఇప్పటికే అనేక ఇళ్లల్లోకి చొరబడి చోరీలకు పాల్పడ్డాడు. ఆ సొమ్ముతో జల్సాలు చేసేవాడు. నగరంలోని అనేక పీఎస్‌ల పరిధిలో చోరీ కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లివచ్చాడు. Also Read: నవంబర్ 15న కూకట్‌పల్లిలోని ఓ ఇంట్లోకి ప్రవేశించి 30 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విక్కీని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఏసీపీ పి.సురేందర్‌రావు నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టిన కేసు వివరాలు వెల్లడించారు. అతడిపై గతంలోనే పీడీ యాక్ట్ ప్రయోగించినా బుద్ధి మార్చుకోకుండా దొంగతనాలు చేస్తూనే ఉన్నాడని ఏసీపీ తెలిపారు. Also Read:
By December 10, 2019 at 11:28AM
No comments