సమయం లైవ్ న్యూస్: రాజశేఖర్ కారుకు ఏడాదిలోనే 21 ట్రాఫిక్ చలానాలు!

⍟ రాజశేఖర్‌కు లైసెన్స్ లేదా: గత నవంబరు 13న అర్ధరాత్రి ఔటర్ రింగ్‌రోడ్డుపై నటుడు రాజశేఖర్ కారు బోల్తా పడిన విషయం తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ముగించుకుని వస్తున్న ఆయన వాహనం పెద్ద గోల్కండ వద్ద అదుపుతప్పి పడింది. ప్రమాద సమయంలో రాజశేఖర్ స్వయంగా వాహనం నడిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో పలు ఆసక్తిక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ఆయన లైసెన్స్ లేకుండానే వాహనం నడిపినట్టు దర్యాప్తులో తేలింది. ⍟ సీఏఏపై అమిత్ షా ప్రకటన: పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు జరుగుతున్న వేళ.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చట్టాన్ని అమలు చేస్తామని హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. జామియా ఇస్లామియా యూనివర్సిటీ ప్రాంగణంలోకి పోలీసులు ప్రవేశించడం పట్ల ఆయన స్పందించారు. ⍟ సీఏఏ ఏం చెబుతుంది: పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన నాటి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిబెంగాల్, ఢిల్లీల్లో ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఈ చట్టం లౌకికవాదానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 కల్పించే సమానత్వ హక్కును ఈ బిల్లు ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్, టీఎంసీ, సీపీఐ(ఎం), ఎంఐఎం, టీఆర్ఎస్ తదితర రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ⍟ తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు: కొత్త సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దుచేసింది. దాతలు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
By December 18, 2019 at 08:55AM
No comments