17ఏళ్ల బాలికపై ఆరు నెలలుగా అత్యాచారం.. హైదరాబాద్‌లో కీచక ఘటన

హైదరాబాద్ నగరంలో మరో కీచక ఘటన వెలుగులోకి వచ్చింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పేట్‌బషీరాబాద్ పీఎస్ పరిధిలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటయ్య అత్యాచారం చేసిన ఘటన జరిగి రోజు గడవకముందే ఓ బాలికపై జరిగిన అఘాయిత్యం బయటపడింది. పేట్‌బషీరాబాద్ పోలీసుల కథనం ప్రకారం జోగిపేటకు చెందిన బాలిక (17) గత మే నెలలో సెలవుల సమయంలో దూలపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. Also Read: ఆమెపై కన్నేసిన పక్కింట్లో ఉండే యువకుడు బంధువునంటూ పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో బాలికతో చనువు పెంచుకుని మొబైల్ నంబర్ తీసుకున్నాడు. బాలికతో తరుచూ మాట్లాడుతూ ఆమె తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి అనేకసార్లు జోగిపేట వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మంగళవారం ఆ యువకుడు మరోసారి బాలికకు ఫోన్ చేయగా ఆమె తల్లి లిఫ్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకోకుండానే అతడు అసభ్యంగా మాట్లాడాడు. Also Read: దీంతో ఆమె తన కూతురిని నిలదీయగా అసలు విషయం చెప్పింది. బాలిక కుటుంబసభ్యులు బుధవారం ఈ ఘటనపై పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసలు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. Also Read:
By December 26, 2019 at 09:34AM
No comments