Breaking News

కిడ్నాప్ చేసి ఏడాదిన్నరగా 11మంది గ్యాంగ్ రేప్.. బిడ్డకు జన్మనిచ్చినా వదలని కామాంధులు


ఓ యువతిని ప్రేమ పేరుతో లొంగదీసుకున్న కామాంధుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా మాయమాటలతో ఆమెను కిడ్నాప్ చేసి ఏడాదిగా నిర్బంధించాడు. రోజూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతూ.. మరికొందరితోనూ లైంగిక దాడి చేయించాడు. ఆ కామాంధుల పైశాచికత్వంతో బాధితురాలు గర్భం దాల్చి ఓ బిడ్డకు జన్మకూడా ఇచ్చింది. అత్యంత నీచమైన ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. Also Read: పాల్‌ఘర్ జిల్లా వసాయ్ తాలూకాలోని రంగాన్ కాలామ్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని ఓ వ్యక్తి ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తరుచూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడేవాడు. ఈ గతేడాది జులై 21వ తేదీన ఆ యువతిని ఇంటి నుంచి తీసుకుపోయిన ఆ వ్యక్తి ఆమెను ఓ ఇంట్లో నిర్బంధించాడు. అప్పటి నుంచి ఆమెను చిత్రహింసలు పెడుతూ రోజూ లైంగిక దాడికి చేసేశాడు. మరికొంతమందితోనూ ఆమెపై అత్యాచారం చేయించేవాడు. Also Read: ఈ క్రమంలోనే బాధితురాలు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. నిందితుల్లో ఒకడిని పెళ్లి చేసుకున్నట్లుగా అఫిడవిట్‌పై సంతకాలు కూడా చేయించుకున్నారు. ఈ నెల మొదటి వారంలో ఆ నరకం నుంచి బయటపడిన బాధితురాలు కుటుంబసభ్యుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు 11 మంది కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను ఇంకా అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. Also Read:


By December 27, 2019 at 08:18AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/mumbai-woman-abducted-raped-for-18-months-11-booked/articleshow/72988148.cms

No comments