Breaking News

అభిమానులుకు Sreemukhi వీడియో మెసేజ్‌.. గుడ్‌ న్యూస్‌ చెప్పిన బ్యూటీ


బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 3లో హాట్‌ ఫేవరెట్‌గా బరిలో దిగిన బ్యూటీ శ్రీముఖి. షో స్టార్ట్‌ అయిన దగ్గర నుంచే టైటిల్ రేసులో ముందున్న ఈ భామ, చివరి రెండు వారాల్లో కాస్త వెనుకపడింది. సింగర్‌ రాహుల్ సిప్లిగంజ్‌ విన్నర్‌గా సత్తా చాటాగా.. రన్నరప్‌ టైటిల్‌తో సరిపెట్టుకుంది. అయితే బిగ్‌బాస్‌లోకి ఎంటర్‌ అవ్వకముందు నుంచే శ్రీముఖికి మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. బుల్లితెర రాములమ్మగా శ్రీముఖి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. పటాస్‌ షోలో తన యాంకరింగ్‌తో పాటు గ్లామర్‌ షోతోనూ ఆకట్టుకున్న శ్రీముఖి బుల్లితెర మీద కనిపించి చాలా రోజులవుతోంది. బిగ్‌ బాస్‌ కోసం మూడు నెలలకు పైగా షూటింగ్‌లకు దూరం కావటంతో శ్రీముఖి స్మాల్‌ స్క్రీన్ మీద సందడి చేసి చాలా రోజులే అవుతోంది. దీంతో అభిమానులు ఆమె యాంకరింగ్ చూసేందుకు ఎదురుచూస్తున్నారు. Also Read: ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా శ్రీముఖి దృష్టికి కూడా తీసుకెళ్లారు. మళ్లీ ఎప్పుడు బుల్లితెర మీద కనిపిస్తావ్‌ అంటూ అభిమానులు అడిగిన ప్రశ్నలకు శ్రీముఖి సమాదానం ఇచ్చింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరిలో ఓ వీడియో మెసేజ్‌ను పోస్ట్ చేసింది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతుందని త్వరలోనే తెర మీద కనిపిస్తానంటూ క్లారిటీ ఇచ్చింది శ్రీముఖి. Also Read: అయితే ఏ ఛానల్‌ ఏ షో అన్న వివరాలు వెల్లడించకపోయినా.. స్టార్‌ మాలో ఓ కొత్త షోతో శ్రీముఖి ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు ఈ షోకు సంబంధించిన ప్రోమో షూట్‌ ప్రస్తుతం జరుగుతుంది. ఈ షూటింగ్‌కు సంబంధించిన వీడియోను కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరిలో పోస్ట్ చేసింది శ్రీముఖి. Also Read:


By November 19, 2019 at 10:30AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bigg-boss-3-telugu-star-sreemukhi-small-screen-re-entry-soon/articleshow/72120297.cms

No comments