ఈ వారం ‘జార్జిరెడ్డి’దే హవా..!
నిన్న శుక్రవారం విడుదలైన సినిమాల్లో ఒకటో రెండో సినిమాలు మాత్రమే ప్రేక్షకులకు తెలిసినవి. తెలుగు తమిళం నుండి పొలోమంటూ.. ఈ వారంలో బాక్సాఫీసు మీద దాడి చేశాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ చిత్రాలు జార్జిరెడ్డి, రాగల 24 గంటల్లో, తోలుబొమ్మలాట సినిమాలున్నాయి. అయితే అందరి దృష్టి జార్జిరెడ్డి బయోపిక్ మీదే ఉంది. ఎందుకంటే జార్జిరెడ్డి సినిమా మీడియాలో మాములుగా పబ్లిసిటీ కాలేదు. అసలు నిర్మాతలు జార్జిరెడ్డి సినిమా ప్రమోషన్ చెయ్యలేదు కానీ.. ఆ సినిమాపై ప్రేక్షకుల్లో పిచ్చ ఆసక్తి రావడానికి.. దానిపై నెలకొన్న కాంట్రవర్సీనే. ఉస్మానియా విద్యార్థి జార్జిరెడ్డి చైత్రని జార్జిరెడ్డి సినిమాగా జీవన్ రెడ్డి తెరకెక్కించాడు. సినిమాలో ఏముందో ఎవరికీ తెలియకపోయినా... ఆ సినిమాని వివాదాలు చుట్టుముట్టడంతో అందరి అటెన్షన్ ఆ సినిమాపై పడి.. ఫ్రీ పబ్లిసిటి అయ్యింది. ఇక సత్యదేవ్, ఈషా రెబ్బాలు రాగల 24 గంటల్లో సినిమా కూడా సస్పెన్స్ థ్రిల్లర్ గా జనాల్లోకి వెళ్లడం, తోలుబొమ్మలాట సినిమా రాజేంద్రప్రసాద్ క్రేజ్ తో ప్రేక్షకుల్లో ఇంట్రస్ట్ కలగడం జరిగింది.
ఇంకా తమిళ సినిమా జాక్‌పాట్ కూడా నిన్నే విడుదలైంది. ఇకపోతే నిన్న విడుదలైన జార్జిరెడ్డి సినిమాకి యావరేజ్ టాక్ రాగా... రాగల 24 గంటల్లో సినిమాకి ప్లాప్ టాక్, తోలుబొమ్మలాట సినిమాకి ప్లాప్ టాక్ పడింది. జార్జిరెడ్డి సినిమాలో యాక్షన్ ఎక్కువై ఎమోషన్ మిస్ కాగా... రాగల 24 గంటల్లో సినిమా పెద్దగా సస్పెన్స్ క్రియేట్ చెయ్యని థ్రిల్లర్ గా మిగిలింది. ఇక తోలుబొమ్మలాట సినిమా నెమ్మదిగా సాగే.. ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మొత్తం మీద జార్జిరెడ్డి క్రియేట్ చేసిన అటెన్షన్ కి ఆ సినిమా నిర్మాతలు లాభపడినట్లే కనబడుతుంది. నాలుగైదు సినిమాల్లో కేవలం జార్జిరెడ్డి మాత్రం కాస్త బెటర్ గా వున్న సినిమా కావడంతో.. ఈవారం జార్జిరెడ్డిదే హావా అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
By November 24, 2019 at 02:57AM
No comments