Breaking News

రకుల్‌‌కి మళ్లీ దెబ్బపడింది.. అయినా తగ్గట్లేదు!


రకుల్‌కి తెలుగులో ‘మన్మథుడు 2’ భారీ డిజాస్టర్. బాలీవుడ్‌లో అజయ్ దేవగన్ పక్కన కుర్ర హీరోయిన్ గా హాట్ హాట్ అందాలతో రెచ్చిపోయి నటించినా అది అంతగా క్లిక్ అవలేదు. అయినా అమ్మడుకి బాలీవుడ్ మీద ఆశ చావలేదు. ఎలాగూ టాలీవుడ్‌లో ఖాళీగానే ఉంటున్నా కదా.. అందుకే బాలీవుడ్‌లో ఎలాంటి అవకాశం వచ్చినా పర్లేదు అనుకున్నట్టుగా ఉంది అమ్మడు వ్యవహారం. తాజాగా రకుల్ నటించిన మర్జావన్ సినిమా బాలీవుడ్‌లో విడుదలై నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. రకుల్ ది ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ పాత్ర కాదు కానీ.. ఈ సినిమాలో వేశ్య పాత్రలో బోల్డ్ గా నటించింది.

ఈ మర్జావన్ సినిమా కోసం రకుల్ బాలీవుడ్‌లో చేసిన ప్రమోషన్స్ అన్నీ ఇన్నీ కావు. అయితే రకుల్ చేసిన ఆ ప్రమోషన్స్‌కి సినిమాకి హిట్ టాక్ పడితే బావుండేది. ఇక సినిమాలో రకుల్ చేసిన వేశ్య పాత్రని, సినిమాని కలిపి బాలీవుడ్ క్రిటిక్స్ చీల్చి చెండాడుతున్నారు. సిద్ధార్థ్‌ మల్హోత్రా, రితేష్‌ దేశ్‌ముఖ్‌ లాంటి పేరున్న హీరోలు నటించిన చిత్రమే అయినా.. సినిమా టాక్ బట్టి కలెక్షన్స్ ఉంటాయి. అసలు సినిమాలో విషయం లేకపోతే అందాల ఆరబోసినా వేస్ట్ అని ఇప్పటికే రకుల్ ప్రీత్ కి అనుభవంలోకి వచ్చింది. అయినా అమ్మడుకి ఏదో మూల ఓ ఆశ. అందుకే ఇంకా బాలీవుడ్ అవకాశాల కోసం జీరో సైజ్‌లోకి మారిపోయి మరీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ అమ్మడుకి అక్కడ బాలీవుడ్ కూడా ఎప్పటికప్పుడు షాకిస్తూనే ఉంది. మరి తెలుగులో ఎంత త్వరగా ఫేడవుట్ అయ్యిందో.. బాలీవుడ్‌లోను అమ్మడుకి అదే పరిస్థితి వచ్చేలా కనబడుతుంది. 



By November 18, 2019 at 05:22AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/48316/rakul-preet-singh.html

No comments