Breaking News

మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై లైంగిక వేధింపులు


ఆడవాళ్లపై అఘాయిత్యాలకు అడ్డు అదుపు లేకుండాపోయింది. ఇలాంటి ఘటనలు కలకలం రేపుతున్నా కూడా కామాంధులు తమ వక్రబుద్ధిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. సామాన్య అమ్మాయిలపైనే కాదు కామాంధులు సెలబ్రిటీలను కూడా వదలడం లేదు. తాజాగా మలయాళ బిగ్‌బాస్ షోలో పాల్గొన్న యువతిపై కదులుతున్న బస్సులో ఓ యువకుడు లైంగిక చర్యలకు పాల్పడ్డాడట. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గురువారం తెల్లవారు జామున కేరళలో చోటుచేసుకుంది. బాధితురాలు అళువ నగరంలో బస్సు ఎక్కి వెళుతుండగా, అప్పర్ బెర్త్‌లో నిద్రిస్తున్న ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడట. ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తుండడంతో కేకలు వేసింది. డ్రైవర్ బస్సు ఆపడంతో నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలని కోరింది. అంతేకాదు తనకు జరిగిన సంఘటనను లైవ్ స్ట్రీమింగ్ చేసింది. అయితే తాను ఏమీ చేయలేదంటూ ఆ కుర్రాడు బుకాయించాడు. సారీ చెప్పి పోలీసులకు మాత్రం పట్టించొద్దంటూ వేడుకున్నాడు. అయినా ఆ బాధితురాలు వెనక్కు తగ్గలేదు. కొట్టక్కల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని ప్రశ్నించగా.. తాను ఆ అమ్మాయిపై ఎలాంటి అఘాయిత్యం చేయలేదని, బెర్త్ పక్కనున్న కర్టెన్స్ మూసేందుకు యత్నిస్తుంటే ఆ అమ్మాయే తప్పుగా అర్థంచేసుకుందని తెలిపాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్‌కు చెందిన ప్రియంక రెడ్డి దారుణ హత్యకు గురికావడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ ఘటన జరిగిన రోజే అదే ప్రదేశంలో మరో యువతి మృతదేహం లభ్యం కావడంతో ప్రజలు షాక్‌కు గురయ్యారు. దాంతో పోలీసులు మరింత అప్రమత్తమై ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని తెలిపారు.


By November 30, 2019 at 09:18AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/malayalam-ex-biggboss-contestant-sexually-harassed-in-a-moving-bus/articleshow/72302757.cms

No comments