Breaking News

ప్రగతిభవన్ వద్ద ఆత్మహత్యకు యత్నించిన భార్యా బాధితుడు


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయమైన ప్రగతిభవన్ వద్ద ఓ భార్య బాధితుడు ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. భార్య నిత్యం తనతో గొడవపడుతూ వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వ్యక్తి శుక్రవారం ప్రగతిభవన్ వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని హల్‌చల్ చేశాడు. Also Read: సోమాజిగూడలో మంజీరా అతిధి గృహం సమీపంలో నివాసం ఉంటున్న పెద్దపోగు అచ్చయ్య (35) మేస్త్రీగా పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్‌ వద్దకు చేరుకున్న అచ్చయ్య వెంట తెచ్చుకున్న పెట్రోల్ శరీరంపై పోసుకుని నిప్పు పెట్టుకోబోయాడు. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న పంజాగుట్ట పోలీసులు అతడిని నిలువరించి తలపై నుంచి నీళ్లు గుమ్మరించారు. Also Read: అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా తన ఆవేదన వెళ్లగక్కాడు. తనకు ఆరుగురు పిల్లలని, వారిని పోషించడం కష్టంగా మారిందని చెప్పాడు. దీనికి తోడు తన భార్య మరియమ్మ నిత్యం తిడుతూ వేధిస్తోందని, వాటిని భరించలేకే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు ఆ భార్యభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. Also Read:


By November 30, 2019 at 09:44AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-suicide-attempt-at-pragathi-bhavan-hyderabad-over-family-disputes/articleshow/72302929.cms

No comments