Breaking News

ప్రియమైన వారితో గోవాలో.. ఇస్మార్ట్‌ బ్యూటీ హాలీడే ట్రిప్‌


సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన అందాల భామ . తొలి సినిమాలోనే తన అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తరువాత మిస్టర్‌ మజ్ను సినిమా చేసిన ఈ భామకు అంతా కలిసి రాలేదు. కానీ డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్‌ శంకర్‌తో సూపర్‌ హిట్‌ అందుకుంది ఆ భామ. ఈసినిమాలో అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది నిధి. సక్సెస్‌ నిధి కెరీర్‌కు చాలా ప్లస్‌ అయ్యింది. ఈ సినిమా సక్సెస్‌తో అమ్మడి వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. అయితే తన కెరీర్‌కు బూస్ట్‌ ఇచ్చిన పూరి అండ్‌ టీంతో నిధి మంచి రిలేషన్‌ మెయిన్‌ టెయిన్‌ చేస్తోంది. ఇస్మార్ట్‌ శంకర్‌ సక్సె్‌స్‌ పార్టీలో పూరి, చార్మీలతో కలిసి ఎంజాయ్‌ చేసిన నిధి.. ఇప్పటికీ అదే రిలేషన్‌ను కొనసాగిస్తోంది. Also Read: ఏ మాత్రం టైం దొరికిన ఇస్మార్ట్‌ టీంతో ఎంజాయ్‌ చేసేందుకు ప్లాన్ చేసుకుంటుంది. తాజాగా ఈ భామ మరోసారి పూరి, చార్మీలతో కలిసి కనిపించింది. ప్రస్తుతం పూరి తనయుడు ఆకాష్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రొమాంటిక్ షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో హీరో హీరోయిన్లతో పాటు సీనియర్‌ నటి రమ్యకృష్ణ కూడా పాల్గొంటుంది. అయితే నిధి షూటింగ్‌లలో కాస్త బ్రేక్‌ దొరకటంతో గోవాలో వాలిపోయింది. అక్కడే ఉన్న పూరి, చార్మిలతో కలిసి ఎంజాయ్‌ చేసింది. `నా సెలవు రోజును నాకు ప్రియమైన వ్యక్తులతో గోవాలో గడిపాను` అంటూ పూరి, చార్మిలతో కలిసి దిగిన ఫోటోను ట్వీట్ చేసింది నిధి. Also Read: ప్రస్తుతం ఈ భామ తమిళ్‌లో జయం రవి హీరోగా తెరకెక్కుతున్న భూమి సినిమాతో పాటు తెలుగులో మహేష్ బాబు అల్లుడు అశోక్‌ గల్లా హీరోగా పరిచయం అవుతున్నా సినిమాలోనూ నటిస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. రామ్‌ హీరోగా దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌ హిట్ మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌ ఇస్మార్ట్ శంకర్‌. రామ్‌ సరసన నిధి అగర్వాల్‌, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా రామ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. చాలా కాలంగా సరైన సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న దర్శకుడు పూరి కెరీర్‌కు బూస్ట్ ఇచ్చింది. అంతేకాదు ఈ సినిమాతో హీరోయిన్లు నిధి, నభాలకు ఈ సినిమా మంచి క్రేజ్‌ తెచ్చి పెట్టింది. Also Read:


By November 19, 2019 at 11:34AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nidhhi-agerwal-in-goa-with-puri-jagannadh-and-charmme-kaur/articleshow/72121011.cms

No comments