Breaking News

ప్రేమించాలంటూ బాలికకు వేధింపులు.. పోకిరీకి దేహశుద్ధి


తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్న పోకిరీని కుటుంబసభ్యులు, స్థానికులు పట్టుకుని చితక్కొట్టిన ఘటన మల్కాజ్‌గిరిలో సోమవారం జరిగింది. మల్కాజ్‌గిరిలోని ఓ కాలనీలో నివాసముండే బాలిక(13) స్థానికంగా ఓ ప్రైవేటు స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమె రోజూ స్కూల్‌కి వెళ్లివచ్చే సమయంలో అదే ప్రాంతానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి సాయిప్రసాద్(35) లైంగికంగా వేధిస్తున్నాడు. Also Read: ప్రేమిస్తున్నానని, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానంటూ బాలికను వేధిస్తున్నాడు. దీనికి బాలిక అంగీకరించకపోవడంతో కొద్దిరోజులుగా ఆమెను అసభ్య పదజాలంతో తిడుతున్నాడు. దీంతో బాలిక ఈ విషయాన్ని తన కుటుంబసభ్యులు, స్కూల్ యాజమాన్యానికి చెప్పింది. దీంతో వారంతా సోమవారం బాలిక స్కూల్‌కి బయలుదేరిన సమయంలో నిఘా పెట్టారు. ఆమె రాకను గమనించిన సాయిప్రసాద్ బాలికను అడ్డగించి వేధించాడు. Also Read: వెంటనే కుటుంబసభ్యులు, స్కూల్ టీచర్లు, స్థానికులు అక్కడికి చేరుకుని సాయిప్రసాద్‌కు దేహశుద్ధి చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో మల్కాజ్‌గిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. Also Read: పక్కింటి యువకుడితో ప్రేమ.. కూతురికి కరెంట్ షాకిచ్చి గొంతుకోసి దారుణహత్య


By November 19, 2019 at 11:37AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-man-arrested-for-eve-teasing-on-minor-girl/articleshow/72120997.cms

No comments