ప్రియుడి కోసం దొంగగా మారిన యువతి.. అక్క ఇంటికే కన్నం

ప్రేమించిన వ్యక్తి ఆర్థిక అవసరాలు తీర్చేందుకు ఓ యువతి దొంగగా మారింది. అక్క ఇంట్లోనే బంగారు నగలు చోరీచేసి పోలీసులకు చిక్కింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బసంతపురానికి చెందిన మెండు ఝాన్సీ(20) ఇంటర్ చదివింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామంతాపూర్ ఇందిరానగర్‌లో ఉంటూ ఉద్యోగవేటలో ఉంది. ఆమె కొంతకాలంగా బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న బింగి రాహుల్‌లో అనే యువకుడితో ప్రేమలో ఉంది. Also Read: అయితే తనకు కొంత డబ్బు అవసరం ఉందని రాహుల్ చెప్పడంతో ఝాన్సీ ఓ కన్నింగ్ ప్లాన్ వేసింది. పదిరోజుల క్రితం పీర్జాదిగూడ నగరపాలకసంస్థ పరిధిలోని బుద్ధానగర్‌లో నివాసం ఉండే అక్క స్వాతి ఇంటికి వెళ్లింది. తిరిగి వెళ్తూ 8 తులాల బంగారు నగలు అపహరించుకుపోయింది. వారిని ప్రియుడు రాహుల్, అతడి ఫ్రెండ్ నిఖిల్‌కు అందజేసింది. ఝాన్సీ వెళ్లిన తర్వాత బీరువా తెరిచిన స్వాతి బంగారు నగలు కనిపించకపోవడంతో షాకైంది. దీంతో వెంటనే మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. Also Read: దీంతో పోలీసులు ఝాన్సీని విచారించగా తానే దొంగిలించినట్లు చెప్పింది. ప్రియుడి కోసమే ఆ చోరీ చేసినట్లు చెప్పడంతో పోలీసులు రాహుల్, నిఖిల్‌ను కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ.2.80 లక్షల విలువైన 8 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చెల్లెలే ఈ దొంగతనానికి పాల్పడిందని తెలుసుకున్న స్వాతి షాకైంది. Also Read:
By November 20, 2019 at 09:49AM
No comments