Breaking News

కేక పెట్టించనున్న మహేష్.. రెండు వేరియేషన్స్‌లో సూపర్‌ స్టార్‌


టాలీవుడ్‌ సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం . కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు మిలటరీ అధికారి పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే టీజర్‌, పోస్టర్స్‌ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ త్వరలో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో వేగం పెంచనున్నారు. ఈ నెల 22న సరిలేరు నీకెవ్వరు టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ టీజర్‌కు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్‌ టాలీవుడ్‌ సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఇటీవల ఎక్కువగా మెసేజ్‌ ఓరియంటెడ్ సినిమాలు చేసిన ఈ మహేష్ ఈ సినిమాతో పూర్తి కమర్షియల్‌ కథను ఎంచుకున్నాడు. Also Read: కర్నూలు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడిగా రష్మిక మందన్న నటిస్తోంది. చాలా ఏళ్ల తరువాత సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి ఈ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా సినిమాను ప్రస్టీజియస్‌గా రూపొందిస్తున్నాడు అనిల్‌. Also Read: ప్రమోషన్‌ కార్యక్రమాల్లో వేగం పెంచుతున్న చిత్రయూనిట్ ఈ శుక్రవారం టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్‌ పోస్టర్స్‌ సినిమా మీద అంచనాలు పెంచేయగా, టీజర్‌తో ఆ అంచనాలు మరింత పెంచనున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ టీజర్‌లో మహేష్ బాబు రెండు డిఫరెంట్‌ వేరియేషన్స్‌లో కనిపించనున్నాడట. ఆర్మీ ఆఫీసర్‌ లుక్‌తో పాటు కర్నూలులో కామన్‌ మ్యాన్‌గా ఉన్న మహేష్‌కు సంబంధించిన సీన్స్‌తో ఈ టీజర్‌ను కట్‌ చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు టీజర్‌లోనే హీరోయిజాన్ని ఓ రేంజ్‌లో ఎలివేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట చిత్రయూనిట్. అనిల్‌ తొలిసారిగా ఓ స్టార్‌ హీరోతో చేస్తున్న సినిమా కావటంతో ఈ మూవీ విషయంలో మరింత జాగ్రత్తగా ప్రమోషన్‌లు ప్లాన్‌ చేస్తున్నాడు. Also Read:


By November 20, 2019 at 09:45AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/super-star-mahesh-babus-sarileru-neekevvaru-teaser-update/articleshow/72136358.cms

No comments