Breaking News

పదో తరగతి విద్యార్థినిపై వారం రోజుల పాటు రేప్


ప్రేమ పేరుతో పదో తరగతి బాలికను ముగ్గులోకి దించిన ఓ యువకుడు ఆమెపై వారం రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడిన ఘటన జిల్లాలో వెలుగుచూసింది. కూకట్లపల్లికి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. ఆమెకు గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం శానంపూడికి చెందిన ఏసోబుతో నెల క్రితం ఫోన్లో పరిచయమైంది. Also Read: దీంతో ఏసోబు బాలికతో రోజూ ఫోన్లో మాట్లాడుతూ ప్రేమిస్తున్నానని చెప్పాడు. టీనేజీలో ఉన్న బాలిక అతడి మాటలకు పడిపోయింది. దీంతో ఈ నెల ఒకటో తేదీన స్కూల్‌కి వెళ్తున్న బాలికను ఏసోబు కలిశాడు. అలా బయటకు వెళ్దామని నమ్మించి బైక్‌పై ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో ఆమెను బెదిరించి చీరాల, వినుకొండ, నరసరావుపేట తదితర ప్రాంతాలకు తిప్పి లాడ్జిల్లో రూమ్‌లు తీసుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇలా వారం రోజుల పాటు బాలికపై చేశాడు. Also Read: గురువారం బాలికను గ్రామ శివారులో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. వారం రోజులుగా తమ కూతురు కనిపించకపోవడంతో తల్లడిల్లిన తల్లిదండ్రులు ఆమె రాకతో ఊపిరి పీల్చుకున్నారు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లావంటూ ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం అద్దంకి ప్రభుత్వాసుపత్రికి పంపిన పోలీసులు ఏసోబుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By November 08, 2019 at 09:58AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/class-10th-girl-raped-by-lover-in-guntur-district/articleshow/71965527.cms

No comments