ఎనిమిదో తరగతి బాలికపై స్కూల్లోనే సామూహిక అత్యాచారం

ఒడిశాలోని బాలసోర్ జిల్లా పరిధిలోని సోరో ప్రాంతంలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై కొందరు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ ప్రైవేటు స్కూల్‌లో చదువుతున్న బాలికను స్కూల్ ముగిసిన తర్వాత నలుగురు విద్యార్థులు వేధించారు. ఇంటికి వెళ్లకుండా అడ్డుకుని స్కూల్ బిల్డింగ్ వెనక్కి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. Also Read: ఈ ఘటన గురించి తెలుసుకున్న టీచర్ రాజేంద్ర దాస్ నిందితులను పోలీసులకు పట్టించకుండా బాధితురాలినే బెదిరించాడు. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందన్న ఉద్దేశంతో ఎవరికీ చెప్పొద్దని బాలికను హెచ్చరించాడు. తర్వాత ఇంటికి చేరుకున్న బాధితురాలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సోరో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read: బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఎస్సీబీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. బాలిక వాంగ్మూలం తీసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అత్యాచార ఘటనతో టీచర్ ప్రమేయం లేదని నిర్ధారించారు. మరోవైపు ఈ కేసును తప్పుదారి పట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని బాధితురాలి కుటుంబం ఆరోపిస్తోంది. Also Read:
By November 25, 2019 at 09:43AM
No comments