Breaking News

ప్రేమ పేరుతో యువతిని లొంగదీసుకుని... మోజు తీరాక మొహం చాటేశాడు


రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఉదయ్‌పూర్ జిల్లాలోని రిషభదేవ్ జిల్లా భీన్మల్ జలోర్ హాల్ ప్రాంతానికి చెందిన గోపాల్ అలియాస్ విక్రమ్ కుమారుడు మాథరం పురోహిత్ మొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. తన స్నేహితుడికి పరిచయమున్న ఓ యువతిపై అతడు కన్నేశాడు. ఆమెతో ఎలాగైనా కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. క్రమంగా ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానంటూ అతడు చెప్పిన మాటలను యువతి నమ్మింది. Also Read: ఆమె క్రమంగా తన దారిలోకి వచ్చిందని తెలుసుకున్న మాథరం.. ఈ ఏడాది మార్చి 23 ఆమెకు మాయమాటలు చెప్పి ఓ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ తన కోరిక తీర్చాలని యువతిని కోరగా ఆమె నిరాకరించడంతో ఇంటికి తీసుకెళ్లిపోయాడు. కొద్దిరోజుల తర్వాత పెళ్లి చేసుకోవడానికి కొంత టైమ్ పట్టేలా ఉందని, ఈలోగా మనమధ్య ప్రేమ మరింత పెరగాలంటే శారీకరంగా కలుద్దామని చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. వీలైనప్పుడల్లా ఆమెను ఫ్రెండ్స్ రూమ్‌కి, లాడ్జిలకు తీసుకెళ్లి చెప్పి లైంగికంగా అనుభవించాడు. అలా కొద్దిరోజుల పాటు యువతిపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు ఆ తర్వాత ఆమెకు మొహం చాటేశాడు. Also Read: బాధితురాలు అతడిని పట్టుకుని నిలదీయగా.. నీపై మోజు తీరిపోయింది, ఎవరి దారి వారు చూసుకుందామంటూ చెప్పడంతో షాకైంది. వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:


By November 29, 2019 at 07:57AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/rajasthan-man-raped-girl-on-pretext-of-marriage-arrested/articleshow/72286228.cms

No comments