హైదరాబాద్‌లో ఘోరం.. కన్నకూతురిపైనే తండ్రి అఘాయిత్యం

వావి వరుసలు మరిచిన ఓ మానవ మృగం కన్నకూతురి జీవితాన్నే చిదిమేసేందుకు ప్రయత్నించింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కూతురితోనే కోరిక తీర్చుకునేందుకు ప్రయత్నించి తండ్రి అన్న బంధానికే మాయని మచ్చ తెచ్చాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన హైదరాబాద్‌లోని పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. Also Read: జీడిమెట్ల రంగారెడ్డినగర్ డివిజన్ గాంధీనగర్ సమీప కాలనీలో ఓ వ్యక్తి(40) భార్య, కుమార్తెతో కలిసి నివాసముంటాడు. 15 రోజుల కిందట అతడి భార్య అనారోగ్యం పాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో వారి కుమార్తె ఇంట్లోనే ఒంటరిగా ఉంటోంది. నాలుగు రోజుల క్రితం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన ఆమె తండ్రి చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తండ్రిపై తనను బలవంతం చేస్తుండటంతో ఆ బాలిక బయటకు పరుగులు తీసి తన స్నేహితురాలికి చెప్పింది. Also Read: ఆ బాలిక ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పగా వారు బాధితురాలిని పిలిచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తండ్రి తనపై అత్యాచారానికి యత్నించాడని బాలిక చెప్పడంతో వారు స్థానికులతో కలిసి గురువారం నిందితుడిని చితకబాదారు. అనంతరం ఆ కామాంధుడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు అతడిని రిమాండ్‌కు తరలించారు. Also Read:
By November 29, 2019 at 08:17AM
No comments