Breaking News

`కోడి కత్తి`తో వైఎస్‌ జగన్‌ ఫ్యాన్స్‌ను కెలికిన సందీప్‌ కిషన్‌


ఒకప్పుడు సినిమా ప్రచారం అంటే పోస్టర్లు, టీజర్‌లు, ట్రైలర్లు అన్నట్టుగా సాగేది. కానీ ఇప్పుడు సీన్‌ మారిపోయింది. సినిమా ప్రమోషన్‌ అంటూ కాంట్రవర్సీ అన్నట్టుగా మార్చేశారు కొందరు ప్రముఖులు. తమ సినిమా మీద జనాల్లో చర్చ జరగాలంటే ఏదో ఒక వివాదం తెర మీదకు తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. Also Read: అయితే కావాలనే చేశారో.. లేక యాదృచ్చికంగానే జరిగిందోగానీ శుక్రవారం రిలీజ్‌ అయిన తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ సినిమా కూడా వివాదంలో తలదూర్చింది. ఈ సినిమాలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కొన్ని సెటైర్లు పేలాయి. ముఖ్యంగా సినిమాలో కోడి కత్తి సీన్‌ వైఎస్సార్‌సీపీ వర్గాలకు ఆగ్రహం తెప్పిస్తోంది. సినిమాలోని ఓ సన్నివేశంలో నటుడు బెనర్జీ.. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ మీద కత్తితో దాడి చేస్తాడు. ఆ దాడి నుంచి తప్పించుకున్న వరలక్ష్మీ తరువాత అదే కత్తితో బెనర్జీని చంపేస్తుంది. అయితే సన్నివేశం అంతా సీరియస్‌గా ఎమోషనల్‌గా సాగినా ఆడియన్స్‌కు మాత్రం నవ్వు తెప్పిస్తుంది. దానికి కారణం బెనర్జీ హత్యాయత్నం చేసింది కోడి కత్తితో కావటమే. Also Read: అంతేకాదు ఓ సన్నివేశంలో పోసాని కృష్ణమురళీ `ఏరా మీ దగ్గర కోడి కత్తులు లేవా` అంటాడు. `జైలుకు వెళ్లొస్తే బలం పెరుగుతుంది. సిపంతీ ఓట్లు పడతాయి` `బాబు గ్రామ వాలంటీరా.. సరుకులన్ని జాగ్రత్తగా తెచ్చావా` `నాకు ఓదార్పు కావాలి` లాంటి డైలాగులు సినిమాలో చాలానే ఉన్నాయి. Also Read: ఇప్పుడు ఈ డైలాగుల మీదే ఇండస్ట్రీ వర్గాలతో పాటు, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌ టీం కావాలనే అధికార పార్టీనిక కెలికిందా..? లేక కామెడీ కోసం చేసిన ప్రయత్నంలో ఇలా జరిగిందా అని చర్చించుకుంటున్నారు. మరి ఈ వివాదం తెనాలి రామకృష్ణను ఎటు తీసుకెళుతుందో చూడాలి. సందీప్‌ కిషన్‌, హన్సిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, రఘుబాబు, మురళీశర్మ, అయ్యప్ప పి శర్మలు కీలక పాత్రల్లో నటించారు. Also Read:


By November 16, 2019 at 11:15AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/setires-on-kodi-kathi-episode-in-sundeep-kishans-tenali-ramakrishna-babl/articleshow/72081486.cms

No comments