Breaking News

ప్రియాంకరెడ్డి తరహాలోనే... కాంచీపురంలో యువతిపై అఘాయిత్యం


దేశంలో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజూ ఎక్కడ చూసిన మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలోని హైదరాబాద్‌ శివారులో ప్రియాంకరెడ్డి అనే వెటర్నరీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ ఖండిస్తున్నారు. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవకముందే తమిళనాడులోని కాంచీపురంలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. Also read: కాంచీపురానికి చెందిన రోజా(20) అనే యువతి నిర్మానుష్య ప్రాంతంలో అనుమానస్పద స్థితిలో మృతిచెందింది. శనివారం కనిపించకుండాపోయిన యువతి ఓ నిర్మానుష్య ప్రాంతంలో గురువారం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రోజా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే రోజా శరీరంపై కత్తిగాట్లు, గాయాలు కనిపించడంతో ఆమెను ఎవరో చిత్రహింసలు పెట్టి చంపేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. Also read: రోజాను చివరిసారిగా రాజేశ్‌ అనే యువకుడితో చూసినట్లు కొందరు చెబుతున్నారు. దీంతో అతడే తన కూతురిని అత్యాచారం చేసి చంపేశాడని రోజా తండ్రి ఆరోపిస్తున్నారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈ ఘటనపై సోషల్‌మీడియాలో దుమారం రేగుతోంది. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్న నెటిజన్లు.. #JusticeForRoja హ్యాష్‌ట్యాగ్‌ను ట్విటర్‌లో ట్రెండింగ్ చేస్తున్నారు. రోజాపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించి, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. Also read:


By November 30, 2019 at 08:20AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-woman-found-dead-in-kanchipuram-under-investigation/articleshow/72302309.cms

No comments