Breaking News

ప్రేమ పేరుతో వల.. మూడో నెల గర్భంతో ఇంటర్ విద్యార్థిని


ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న బాలికను ఓ యువకుడు ప్రేమ పేరుతో వంచించి గర్భవతిని చేసిన ఘటన జిల్లా మదనపల్లెలో వెలుగులోకి వచ్చింది. మదనపల్లె గ్రామీణ మండలానికి చెందిన ఓ బాలిక మదనపల్లెలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఈ నేపథ్యంలోనే కుమారపురానికి కళ్యాణ్ అనే యువకుడు బాలికపై కన్నేశాడు.. Also Read: రోజూ బాలిక కాలేజీకి వెళ్లే మార్గంలో తిరుగుతూ మాయమాటలతో ఆమెను ముగ్గులోకి దించాడు. ప్రేమిస్తున్నానంటూ నమ్మించి సినిమాలు, షికార్లకు తిప్పాడు. ఈ క్రమంలోనే బాలికను శారీరకంగా లొంగదీసుకుని అనేకసార్ల లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇటీవల కూతురి శరీరంలో మార్పులు గమనించిన తల్లిదండ్రులు వైద్య పరీక్షలు చేయించగా మూడో నెల గర్భంతో ఉన్నట్లు తేలింది. Also Read: దీంతో షాకైన బాలిక తల్లిదండ్రులు మదనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కళ్యాణ్ అనే యువకుడు తమ కూతురిని శారీరకంగా లొంగదీసుకుని గర్భవతిని చేశాడని, అతడిపై కఠినచర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By November 01, 2019 at 09:01AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/inter-girl-get-pregnant-before-marriage-in-chittor-case-filed/articleshow/71846438.cms

No comments