Breaking News

9ఏళ్ల బాలికను బైక్ ఎక్కించుకుని తీసుకెళ్లి అత్యాచారం


అభం శుభం తెలియని తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. మాయమాటలు చెప్పి బాలికను బైక్‌పై ఎక్కించుకున్న యువకుడు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జోగులాంబ జిల్లా మల్దకల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(9) తల్లి చనిపోవడంతో అమ్మమ్మ దగ్గర ఉంటోంది. Also Read: బాలికపై కన్నేసిన అదే గ్రామానికి చెందిన నరేశ్ అనే యువకుడు శనివారం సాయంత్రం ఇంటి దగ్గర ఆడుకుంటున్న ఆమెతో మాటలు కలిపాడు. తనతో వస్తే చుట్టుపక్కల ప్రాంతాలు చూపిస్తానని మాయమాటలు చెప్పిన బైక్ ఎక్కించుకున్నాడు. గ్రామ శివారులోని ఓ పొలం దగ్గరికి తీసుకెళ్లి ఆమెను బెదిరించి చేసి తర్వాత ఇంటి దగ్గర వదిలేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. Also Read: అయితే శనివారం రాత్రి బాలిక కడుపునొప్పితో విలవిల్లాడటంతో అమ్మమ్మ ఏం జరిగిందని ఆరా తీసింది. దీంతో తనపై జరిగిన అత్యాచారం గురించి చెప్పింది. బాధితురాలి అమ్మమ్మ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నిందితుడిపై పోక్సో, నిర్భయ చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By November 04, 2019 at 09:51AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/9-year-old-girl-allegedly-raped-by-neighbour-in-jogulamba-gadwal-district/articleshow/71885494.cms

No comments