Breaking News

13 ఏళ్ల తరువాత మళ్లీ మెగాస్టార్‌తో..!


సైరా నరసింహారెడ్డితో మరో బిగ్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను లాంచనంగా ప్రారంభించాడు చిరు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్‌కు జోడిగా ఓ సీనియర్‌ హీరోయిన్‌ను ఫిక్స్ చేశారు. కోలీవుడ్‌లో ఇంట్రస్టింగ్‌ సినిమాలతో ఆకట్టుకుంటున్న క్రేజీ బ్యూటీ ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నటించనుంది. గతంలో వీరిద్దరు స్టాలిన్‌ సినిమాలో కలిసి నటించారు. మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2006లో రిలీజ్‌ అయ్యింది. ఇప్పుడు 13 ఏళ్ల తరువాత ఈ కాంబినేషన్‌ మళ్లీ రిపీట్ అవుతోంది. Also Read: మహేష్ బాబు హీరోగా భరత్‌ అనే నేను సినిమా తెరకెక్కించిన కొరటాల శివ తరువాత చిరు సినిమా కోసం లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్నాడు. చాలా రోజుల స్క్రిప్ట్ వర్క్‌ తరువాత ఇటీవలే సినిమాను ప్రారంభించాడు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను కూడా మెగా పవర్‌ స్టార్‌ నిర్మిస్తున్నాడు. Also Read: ఇక చిరు హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా దేశవ్యాప్తంగా 180 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ రిలీజ్ అయ్యింది. అయితే సౌత్‌లో సూపర్‌ హిట్ అయిన సైరా, ఉత్తరాది ప్రేక్షకులను మాత్రం అలరించలేకపోయింది. దీంతో సైరా నరసింహారెడ్డి ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. Also Read:


By November 05, 2019 at 09:48AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/trisha-confirmed-as-the-heroine-in-chiranjeevi-koratala-siva-film/articleshow/71916543.cms

No comments