TSRTC Strike: దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు.. మాజీ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్యకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు వేగంగా మీదకు దూసుకురావడంతో.. ఆయన ప్రయాణిస్తున్న బైకు రోడ్డు కిందకు దింపాల్సి వచ్చింది. దీంతో బైక్ బురద గుంటలోకి దూసుకెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే హంగులు ఆర్భాటాలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. ఎక్కడికైనా బైకు మీద, బస్సుల్లో ప్రయాణించడం ఆయనకు అలవాటు. సీపీఎం మండల కార్యదర్శి బొప్పెన కిరణ్‌తో కలిసి ఏపీలోని వీఆర్‌పురం వద్ద శబరి బ్రిడ్జి మీదుగా మాజీ ఎమ్మెల్యే ప్రయాణించారు. కిరణ్ బండి నడుపుతుండగా.. రాజయ్య వెనుక కూర్చున్నారు. వీరి బైక్ బ్రిడ్జిని దాటగానే.. వెనుక నుంచి భద్రాచలం డిపోకు చెందిన బస్సు దూసుకొచ్చింది. ఒక్కసారిగా బస్సు తమ వైపు దూసుకొస్తుండటంతో.. కిరణ్ బండిని రోడ్డు పక్కకు దింపారు. దీంతో కొద్దిలో వీరు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నేపథ్యంలో.. తాత్కాలిక డ్రైవర్ బస్సు నడుపుతున్నాడని తెలుస్తోంది. బస్సు అతివేగంతో మాజీ ఎమ్మెల్యే మీదకు దూసుకొచ్చిన సంగతి తెలుసుకున్న గ్రామస్థులు.. వీఆర్‌పురం సెంటర్లో బస్సును ఆపారు. డ్రైవర్‌ను మందలించి పంపారు. పోలీసులు కూడా డ్రైవర్‌ను మందలించారు.
By October 08, 2019 at 10:08AM
No comments