Breaking News

VIzag: సీఎం జగన్ సెక్రటరీ పేరుతో రూ.3.30లక్షలకు టోకరా


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్సనల్ సెక్రటరీని అంటూ మోసాలకు పాల్పడుతున్న బుడుమూరు నాగరాజు అనే వ్యక్తిపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వరరెడ్డి పేరుతో ఇటీవల గాయత్రీ విద్యా పరిషత్‌ ఉపాధ్యక్షులు డి.దక్షిణామూర్తికి ఫోన్ చేసిన నిందితుడు రూ.3.30లక్షలు కొట్టేసేందుకు ప్లాన్ వేశాడు. ఆయన సకాలంలో అప్రమత్తం కావడంతో నాగరాజు మోసం వెలుగులోకి వచ్చింది. Also Read: ఈ నెల 4న విశాఖ నగరంలోని గాయత్రీ విద్యా పరిషత్‌ ఉపాధ్యక్షులు డి.దక్షిణామూర్తి ఓ ఫోన్‌కాల్ వచ్చింది. ‘‘నేను ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వరరెడ్డిని మాట్లాడుతున్నా. ఓ అబ్బాయి అంతర్జాతీయ క్రికెట్‌ టోర్నమెంట్‌ ఇంగ్లాండ్‌ టూర్‌కు ఎంపికయ్యాడు. అతడు పేదవాడు కాబట్టి రూ. 3,30,400లు సహాయం చేయాలని సార్‌ చెప్పారు. వివరాలను ఆ కుర్రాడు మీకు అందిస్తాడు. సాయం చేయండి’ అని అవతలి వ్యక్తి చెప్పాడు. మరుసటి ఓ యువకుడు ఆయన్ని కలిసి తన పేరు బుడుమూరు నాగరాజు అని పరిచయం చేసుకొని బ్యాంకు ఖాతా వివరాలు తెలిపాడు. బ్యాంకులో సొమ్ము వేసిన తర్వాత తనకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నాడు. తన పేరిట పత్రికల్లో వచ్చిన వార్తలు, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ పేరిట ఉన్న ఓ లేఖను వాట్సాప్‌లో దక్షిణామూర్తికి పంపించాడు. మళ్లీ ఫోన్‌ చేసి 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా బ్యాంకులో సొమ్ము డిపాజిట్ చేయాలని కోరాడు. Also Read: అందుకు సరేనన్న దక్షిణామూర్తి తనకళాశాల సిబ్బందితో పాటు సచివాలయంలో తమకు తెలిసిన వారిని ఆరా తీయగా.. నాగేశ్వరరెడ్డి అనే వ్యక్తి మఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నట్లు చెప్పారు. దీంతో ఆయన ఆ యువకుడి బ్యాంక్ అకౌంట్లో రూ.3,30,400 డిపాజిట్ చేశారు. అయినప్పటికీ అనుమానంతో అదే కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్‌గా ఉన్న భాస్కర్ అనంతరావు ద్వారా బుడుమూరు నాగరాజు గురించి ఆరా తీయించారు. విశాఖకు చెందిన అతడు గతంలో క్రికెట్‌లో రాణించేవాడని, అనేక నేరాల్లో అనుమానితుడిగా ఉన్నాడని తెలియడంతో బ్యాంకు అధికారులతో మాట్లాడి బదిలీ అయిన సొమ్మును విత్‌డ్రా చేయకుండా హోల్డ్‌లో పెట్టించారు. Also Read: వెంటనే విశాఖ ఆరిలోవ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి నాగరాజుపై ఫిర్యాదు చేశారు. నాగరాజుపై ఆరా తీసిన పోలీసులకు అతడిపై విశాఖలోని పలు స్టేషన్లతో పాటు, నెల్లూరు జిల్లాలోనూ కేసులున్నట్లు తెలిసింది. Also Read:


By October 08, 2019 at 10:45AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/vizag-filed-filed-case-against-former-cricketer-on-cheating/articleshow/71487434.cms

No comments