Breaking News

RajiniKanth: రజినీ అంటే అది.. తలైవా ది గ్రేట్


సినిమాలు చూసి, దాంట్లో ఆయన మ్యానరిజమ్స్ చూసి, ఆయన చెప్పిన డైలాగ్స్ విని చప్పట్లు కొట్టి సంతోషిస్తాం. కానీ అవి విని రియల్ లైఫ్‌లో ఆచరిస్తే మాత్రం మనకి కూడా తిరుగుండదు. రజినీకాంత్ మాత్రం అతను చెప్పినవాటిని తూ.చ తప్పకుండా పాటిస్తాడు. ఇప్పుడు కూడా అలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది.రజినీకాంత్ నటుడిగా నిలదొక్కుకుంటున్న తొలినాళ్లలో అంటే 1978లో రజినీకాంత్ హీరోగా భైరవి అనే సినిమా నిర్మించారు తమిళ్ ప్రొడ్యూసర్ కమ్ రైటర్ అయిన కలైజ్ఞానం. అయితే ఆగస్టు 14న నటుడు శివకుమార్, డైరెక్టర్ భారతీరాజా మరికొంతమంది కలిసి 50 సంవత్సరాలుగా సినిమాలకు కలైజ్ఞానం అందించిన సేవలను గౌరవిస్తూ ఆయన్ని సత్కారించారు. ఆ ఫంక్షన్‌కి రజినీకాంత్ గెస్ట్‌గా వచ్చారు. Also Read: అదే వేదికపై శివకుమార్ మాట్లాడుతూ కలైజ్ఞానం సినిమాలపై ఇష్టంతో నష్టపోయినా కూడా సినిమాలు తీసి 90 సంవత్సరాల వయసులోనూ సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటున్నారు అని, ఆయనకి ఒక ఇల్లు ఇప్పించాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు.ఆ కార్యక్రమానికి అతిధిగా వచ్చిన మంత్రి ఒకసారి సీఎం తో చెప్పి ఆయనకు సొంత ఇల్లు ఇప్పించేందుకు ప్రయత్నిస్తా అని చెప్పుకొచ్చారు. కానీ రజినీకాంత్ మాత్రం అదే వేదికపై మాట్లాడుతూ ''నేను హీరోగా రాణించగలను అని నమ్మి సినిమా తీసిన నిర్మాత, రైటర్ కలైజ్ఞానం. అందుకే ఆయనకి ఇల్లు సమకూర్చే అవకాశాన్ని తమిళనాడు ప్రభుత్వానికి ఇవ్వదలచుకోలేదు. త్వరలోనే ఆయనకి సొంత ఇల్లు ఉంటుంది '' అని చెప్పారు. అయితే ఈ స్పీచ్‌లో కూడా ఎక్కడా కూడా ఇస్తాను లేక ఆదుకుంటాను అని చెప్పలేదు, కేవలం 'ఉంటుంది' అని మాత్రమే మాట్లాడి ఆ నిర్మాత ఆత్మభిమానాన్ని కూడా కాపాడాడు. Also Read: కట్ చేస్తే నెలన్నర లోపే ఆయనకి చెన్నైలోని ఒక మంచి ఏరియాలో కోటి రూపాయలు పెట్టి ఒక ట్రిపుల్ బెడ్‌రూమ్ హౌస్ కొనిచ్చాడు రజినీకాంత్. తనని హీరోగా పరిచయం చేసిన వ్యక్తి ఇప్పుడు కష్టాలో ఉన్నాడు అని తెలిసి వెంటనే స్పందించే మంచిగుణం ఎంతమందికి ఉంటుంది. భారతీరాజా ఆ ఇల్లు చూసి దగ్గరుండి కొనిపెట్టే పనులు అవన్నీ పూర్తిచేశారు. అయితే మళ్ళీ ప్రొడ్యూసర్ ఆ ఇంట్లోకి గృహ ప్రవేశం చేసినప్పుడు కూడా మళ్ళీ వచ్చి పూజ జరిగినంతసేపు ఉంది వెళ్లారు. ఇలాంటివి సినిమాల్లో తప్ప బయట జరగడం అరుదు. అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యాడు, అనేకమంది తమ గుండెల్లో గుడికట్టుకుని ఆరాధించే దేవుడిలా మారాడు. ఇది తెలిసాక 'తలైవా ది గ్రేట్' అనకుండా ఉండగలమా?. Also Read:


By October 08, 2019 at 10:05AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/super-star-rajinikanth-in-news-once-again-for-his-unmatchable-behaviour/articleshow/71487131.cms

No comments